హోమ్ /వార్తలు /సినిమా /

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత.. మరో కాంట్రవర్షల్ బయోపిక్‌తో వస్తోన్న వర్మ..

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత.. మరో కాంట్రవర్షల్ బయోపిక్‌తో వస్తోన్న వర్మ..

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్

sasikala biopic | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇచ్చిన సక్సెస్‌తో రామ్ గోపాల్ వర్మ..మరో కాంట్రవర్షల్ క్యారెక్టర్ అయిన శశికళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాతో  రామ్ గోపాల్ వర్మ మరోసారి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఏమైనా అనుకోండి .. ఎవరి జీవితంపైనైనా వర్మ మంచిగా దృష్టి పెడితే ..ఆయనంత మంచిగా ఎవరు సినిమా తీయలేరన్న విషయం మరో మారు ప్రూవ్ అయింది. లక్ష్మీ పార్వతి..ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ..తనకు తెలసిన తాను తీయాలకున్న రీతిలో తీసి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఇక బాలకృష్ణ కూడా తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కించాలనుకున్న బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. ఆ తర్వాత వివాదాలు లేని ఎన్టీఆర్ జీవితం తీయడం ఇష్టం లేక రామ్ గోపాల్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. అంతా కొత్త వాళ్లతో చాలా తక్కువ ఖర్చుతో తీసిన ఈ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది.


ఇక బయోపిక్‌లో జయలలిత, శశికళ పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో


ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో రామ్ గోపాల్ వర్మ..మరో కాంట్రవర్షల్ క్యారెక్టర్ అయిన శశికళ బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అంతేకాదు ప్రేమ అనేది రాజకీయాలకన్నా డేంజర్ అంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు శశికళ కుటుంబాన్ని తమిళనాడులో  మన్నార్ గుడి మాఫియాగా పిలుస్తారు. జయలలిత అధికార పీఠం మీద ఉన్న పెత్తనం మొత్తం ఈమె చేసింది. అంతేకాదు జయలలిత హాస్పిటల్‌లో ఉన్నపుడు మన్నార్ గుడి మాఫియా ఏం చేసింది. అసలు శశికళ..జయలలిత ఎలా దగ్గరైంది. ఎలా అభిమాన పాత్రరాలైందనే విషయాన్ని ఈ సినిమాలో వర్మ చూపెట్టబోతున్నాడు.


ఇక బయోపిక్‌లో జయలలిత, శశికళ పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి.
శశికళ బయోపిక్


ఇప్పటికే అమ్మ జయ లలిత జీవితంపై ఒకేసారి మూడు నాలుగు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా తెరకెక్కుతోంది. కానీ రామ్ గోపాల్ వర్మ..మాత్రం ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగిందనేది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూపెట్టారు. అలాగే జయలలిత జీవితంలో శశికళ ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఈ సినిమాలో చూపెట్టబోయే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి కాంట్రవర్షల్ సబ్జెక్ట్ తర్వాత అంతకు మించిన వివాదాలున్న శశికళ, జయలలిత బంధంపై ‘శశికళ’ బయోపిక్‌ను రామ్ గోపాల్ వర్మ ఎక్కుపెడుతున్నాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్’లో అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించినట్టే ఇపుడు తీయబోయే శశికళ బయోపిక్‌ను కూడా కొత్త వాళ్లతోనే తెరకెక్కించే అవకాశమే ఎక్కువగా ఉంది. మరి ‘శశికళ’ బయోపిక్  తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. 


 

First published:

Tags: AP Politics, Jayalalithaa Biopic, Kollyood News, Lakshmis NTR, NTR, NTR Biopic, Ram Gopal Varma, RGV, Sasikala, Tamil Cinema, Tamil nadu Politics, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు