చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్ పై కన్నేసిన కార్తి..

ఆ మధ్యన వచ్చిన ‘ఖాకీ’ తర్వాత సరైన సక్సెస్ లేని కార్తి.. రీసెంట్‌గా చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ టైటిల్ ‘ఖైదీ’ సినిమాతో పలకరించాడు. తాజాాగా కార్తి.. తన నెక్ట్స్ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్‌ను వాడుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం.

news18-telugu
Updated: November 13, 2019, 9:56 AM IST
చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్ పై కన్నేసిన కార్తి..
చిరంజీవి,కార్తి,పవన్ కళ్యాణ్ (file Photos)
  • Share this:

ఆ మధ్యన వచ్చిన ‘ఖాకీ’ తర్వాత సరైన సక్సెస్ లేని కార్తి.. రీసెంట్‌గా చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ టైటిల్ ‘ఖైదీ’ సినిమాతో పలకరించాడు. టైటిల్‌‌ మహత్యంతో  పాటు కథ కూడా ఇంట్రెస్టింగ్‌గా వుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఒకప్పుడు చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ‘ఖైదీ’లాగే కార్తికి ఈ సినిమా ఊపిరి పోసింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న కార్తి.. తమిళంలో ‘తంబి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. తెలుగులో తంబి అంటే తమ్ముడు అని అర్థం. అందుకే తన నెక్ట్స్ మూవీకి ‘తమ్ముడు’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో కార్తి ఉన్నట్టు సమాచారం. ఇక అన్నయ్య చిరంజీవి టైటిల్ ‘ఖైదీ’తో సూపర్ హిట్ అందుకున్న కార్తి.. తాజాగా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ ‘తమ్ముడు’ టైటిల్‌ను నెక్ట్స్ సినిమాకు వాడుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో జ్యోతిక.. కార్తి అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అదే రోజున బాలకృష్ణ ‘రూలర్’, సాయి ధరమ్ తేజ్. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు విడుదల కానున్నాయి. మొత్తానికి దీపావళికి సూపర్ హిట్ అందుకున్న  కార్తి.. క్రిస్మస్ పండగన అదే ఫీట్‌ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు