news18-telugu
Updated: November 16, 2019, 7:51 AM IST
మరోసారి చిరంజీవి టైటిల్‌తో పలకరించబోతున్న కార్తి (Twitter/Photo)
ఆ మధ్యన వచ్చిన ‘ఖాకీ’ తర్వాత సరైన సక్సెస్ లేని కార్తి.. రీసెంట్గా చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ టైటిల్ ‘ఖైదీ’ సినిమాతో పలకరించాడు. టైటిల్ మహత్యంతో పాటు కథ కూడా ఇంట్రెస్టింగ్గా వుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఒకప్పుడు చిరంజీవికి స్టార్ హీరో ఇమేజ్ తీసుకొచ్చిన ‘ఖైదీ’లాగే కార్తికి ఈ సినిమా ఊపిరి పోసింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న కార్తి.. తమిళంలో ‘తంబి’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. తెలుగులో తంబి అంటే తమ్ముడు అని అర్థం. అందుకే తన నెక్ట్స్ మూవీకి ‘తమ్ముడు’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని అందరు అనుకున్నారు. అనూహ్యంగా ఈ సినిమాకు తెలుగులో ‘దొంగ’ అనే టైటిల్ ఖరారు చేసారు. ‘దొంగ’ పేరుతో చిరంజీవి పాత సూపర్ హిట్ సినిమా ఉందన్న సంగతి తెలిసిందే కదా.

చిరంజీవి పాత సూపర్ హిట్ టైటిల్‌తో వస్తోన్న కార్తి (twitter/Photo)
ఈ సినిమాలో జ్యోతిక.. కార్తి అక్క పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అదే రోజున బాలకృష్ణ ‘రూలర్’, సాయి ధరమ్ తేజ్. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు విడుదల కానున్నాయి.

‘దొంగ’గా వస్తోన్న కార్తి (twitter/Photo)
మొత్తానికి దీపావళికి సూపర్ హిట్ అందుకున్న కార్తి.. క్రిస్మస్ పండగన అదే ఫీట్‌ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 16, 2019, 7:49 AM IST