ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగులో హిట్టయిన సినిమాలు వరసగా హిందీలో రీమేకై మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేస్తే హిందీలో కూడా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను హిందీలో షాహిద్ కపూర్ అదే రేంజ్లో ఉతికి ఆరేసాడు. ఈ సినిమా విడుదలైన నాల్గో రోజుకే రూ.100 కోట్ల క్లబ్బులో చేరినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘కబీర్ సింగ్’ ఇచ్చిన సక్సెస్‌తో ఇపుడు మరో తెలుగు సూపర్ హిట్ మూవీచేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది.

నాని ‘జెర్సీ’ రీమేక్‌లో షాహిద్ కపూర్ ?
ఇపుడా సినిమాకు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను కరణ్ జోహార్ మంచి రేటుకే దక్కించుకున్నాడు. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ను తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.రీసెంట్గా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా హిందీ వెర్షన్‌ను మంచిగానే డీల్ చేసాడు. దీంతో ‘జెర్సీ’ రీమేక్ బాధ్యతలను గౌతమ్ తిన్ననూరికి అప్పగించినట్టు సమాచారం. మొత్తానికి తెలుగు సూపర్ హిట్ రీమేక్‌లతో షాహిద్ కపూర్.. మరో జితేంద్ర, అనిల్ కపూర్ల తరహాలో స్టార్ డమ్ నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:June 25, 2019, 19:15 IST