Kiara Advani: టాలీవుడ్‌కి దూరమైనా బాలీవుడ్‌లో అదరగొడుతున్న కియారా..

‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేష్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కిర్రాక్ పోరి కియారా అద్వానీ. తాజాగా ఈ భామ ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉంది. అంతేకాదు బాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌ స్థానంపై కన్నేసింది.

news18-telugu
Updated: September 13, 2019, 11:23 AM IST
Kiara Advani: టాలీవుడ్‌కి దూరమైనా బాలీవుడ్‌లో అదరగొడుతున్న కియారా..
కియారా అద్వానీ Instagram.com/kiaraaliaadvani/
news18-telugu
Updated: September 13, 2019, 11:23 AM IST
‘భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేష్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కిర్రాక్ పోరి కియారా అద్వానీ. ఆ సినిమా సెట్స్‌ పైకి రావడంతో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో జోడి కట్టింది.ఇక రామ్ చరణ్‌కి ‘వినయ విధేయ రామ’ ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే.  కియారాకి మాత్రం టాలీవుడ్‌లో మళ్లీ  ఎంట్రీ ఇవ్వకుండా చేసింది. ‘వినయ విధేయ రామ’ దెబ్బకి అల్లు అర్జున్ కూడా కియారాకు  మొహం చాటేశాడు. లేదంటే త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ జోడి కియారానే నటించాల్సింది. ‘వినయ విధేయ రామ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలబడంతో టాలీవుడ్ దర్శకులు కియారా వైపు చూడడమే మానేశారు. అదే సమయంలో  బాలీవుడ్ మాత్రం కియారా అద్వానీకి రెడ్  కార్పెట్‌తో స్వాగతం పలికింది.

కియారా అద్వానీ instagram


బాలీవుడ్‌లో ఈ భామ.. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ లో బోల్డ్ గా షాహిద్ కపూర్ పక్కన నటించి బాలీవుడ్ జనాలకు హీట్ పుట్టించింది. అంతేకాదుఈ సినిమాతో అక్కడి దర్శకనిర్మాతల దృష్టి ఒక్కసారిగా తన మీద పడేలా చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ కియారా అద్వానీ పేరు ఒక సంచలనం అని చెప్పాలి. ఫ్యాషన్ ప్రపంచానికి ఒక ఐకాన్ గా తయారైంది. కియారాలో ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే లీనమై నటించగలదు.. అంతే కాదు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ కియారాలో ఉంది .యూత్ ని ఎలా మాయలో పడేయాలో… ఎలా మాయచేసి కట్టిపడేయాలో ఈమెకు బాగా తెలుసు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటించడం.. అందులోనూ హాట్ హాట్ సీన్లలో నటించడానికి ఈమె అస్సలు వెనుకాడడు.

కియారా అద్వానీ (‘Instagram/Photo)




ఇక అవార్డు వేడుకల్లో కూడా అదిరిపోయే డాన్సులతో అందరిలోనూ జోష్ రేపుతుంటుంది. ఇక ప్రముఖ మ్యాగ్జైన్ లకు కూడా అదిరిపోయే డ్రెస్సులు ధరించి ఫోటోలకు ఫోజులిస్తుంటుంది. అది పక్కన పెడితే.. కేవలం కుర్ర కారు కోసమే అన్నట్టు హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. పోస్ట్ చేసిన గంటల్లోనే.. వాటికి లక్షల లైకులు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ భామ చేతిలో అర డజను పైగా హిందీ సినిమాలున్నాయి. అవి కూడా హిట్టయితే ఈమె బాలీవుడ్ నెంబర్ వన్ రేసులో నిలవడం పక్కా అని చెప్పొచ్చు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...