జానీ ఫ్లాప్‌తో అన్నయ్య ఈ పుస్తకం ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్..

పవన్ 26, 27, 28 సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 2నే అనౌన్స్ చేయబోతున్నారు. ముందుగా వకీల్ సాబ్ అప్‌డేట్ ఉదయం 9.09 నిమిషాలకు రాబోతుందని ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేసాడు.

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్ అభిమానులతో  కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో 2003లో పవన్ కళ్యాణ్ తన ఓన్ డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేసిన జానీ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా..

  • Share this:
    కొన్నింటిని మనం డబ్బుతో కొనలేము. అలాంటి వాటిలో విద్య ఒకటి. ఎవరైన మన దగ్గరనున్న సంపదను దోచుకున్నా.. మన జ్ఞాన సంపదను దోచుకోలేరు. అలాంటి జ్ఞానాన్ని మనకు అందించేవే పుస్తకాలు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా  పవన్ కళ్యాణ్ అభిమానులతో  కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పట్లో 2003లో పవన్ కళ్యాణ్ తన ఓన్ డైరెక్షన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేసిన జానీ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ చిత్రం పవన్ కళ్యాణ్‌ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సమయంలో ఎంతో డిప్రెషన్‌లో ఉన్న నాకు అన్నయ్య నాగబాబు శిష్టా ఆంజనేయ శాస్త్రి రాసిన ‘ఖారవేలుడు’ పుస్తకాన్ని ఇచ్చారు. ఈ పుస్తకం చదవడంతో రాజకీయాల పట్ల అప్పటి వరకు నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేసినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు అందులోని పంక్తులను అభిమానులతో షేర్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్.


    అంతేకాదు అభిమానులు వీలైతే ఈ పుస్తకం చదవాలని కోరారు. పుస్తక పఠనంతో మనలో మానసిక ధృడత్వాన్ని పెంచుతుందన్నారు. ఖారవేలుడు పుస్తకంతో పాటు పవన్ ‘వనవాసి’, ‘అమృతం కురిసిన రాత్రి’ తదితర పుస్తకాల గురించి తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలను లైన్‌లో పెట్టాడు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published: