అల్లు అర్జున్ తెలుగులోనే కాదు ఇండియన్ వైడ్‌గా స్టార్. ఈయన సినిమాలకు తెలుగులో మాత్రమే కాదు.. తమిళం, మలయాళంలో కూడా భారీ క్రేజ్ ఉంటుంది. దాంతో పాటు హిందీ మార్కెట్లోనూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈయన సినిమాలు అక్కడ డబ్ అవుతుంటాయి. యూ ట్యూబ్‌లో విడుదలై అక్కడ సంచలన విజయం సాధిస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తెలుగులో ఏ హీరోకు లేని ఫాలోయింగ్ హిందీలో బన్నీకి ఉంది. నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటే ప్రాణమిచ్చేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలు యూ ట్యూబ్‌లో రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఈయన నటించిన డిజే అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా హిందీలో అదే పేరుతో డబ్ చేసారు. యూ ట్యూబ్‌లో రెండేళ్ళ కింద విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దాటేసింది. తెలుగు సినిమాలు హిందీలో అనువాదమై.. 300 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సినిమాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకీ నాయక.. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలు మాత్రమే 300 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇప్పుడు తెలుగు నుంచి అరుదైన ఘనత సాధించిన మూడో సినిమాగా డిజే నిలిచింది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా 2017లో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన 25వ సినిమాగా వచ్చిన డిజే.. దాదాపు 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

‘సరైనోడు’ మూవీ పోస్టర్
థియేటర్స్‌లో యావరేజ్‌గానే నిలిచినా కూడా హిందీ అనువాదం మాత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమాను దిల్ రాజు యూ ట్యూబ్‌లో విడుదల చేసాడు. దానికి 95 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీలో మాత్రం 302 మిలియన్ దాటిపోయింది. జయ జానకీ నాయకా సినిమాకు 380 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఏదేమైనా కూడా తెలుగు సినిమాలకు హిందీలో వస్తున్న ఆదరణ చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. అందుకే మన సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా 10 కోట్ల వరకు పలుకుతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 21:44 IST