'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్‌తో ఛార్మికి కొత్త కష్టాలు.. అసలేం జరిగిందంటే..
ఛార్మి కౌర్ హీరోయిన్గా కాకుండా నిర్మాతగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఛార్మికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళితే..
news18-telugu
Updated: September 18, 2019, 12:57 PM IST

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ ఓపెనింగ్‌లో ఛార్మి కౌర్ (File Photo)
- News18 Telugu
- Last Updated: September 18, 2019, 12:57 PM IST
చార్మీ తెలుగు తెరకి గ్లామర్ ను పరిచయం చేసిన కథానాయికలలో ఒకరు. అందాల కథానాయికగా కుర్రకారు హృదయాలను దోచుకున్న చార్మీ, ఆ తరువాత హఠాత్తుగా నటనకు కామా పెట్టేసి నిర్మాణం వైపు దృష్టి పెట్టింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి గత కొంతకాలంగా సినిమా నిర్మాణాల్లో భాగమవుతూ వస్తున్న ఛార్మి.. ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను పూరీ జగన్నాథ్ భాగస్వామంలో తెరకెక్కించన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా రోజుల తర్వాత దర్శకుడిగా హిట్టు అందుకున్నారు. అంతేకాదు నిర్మాతగా మరోసారి సక్సెస్ చవిచూసారు. 13 ఏళ్ల క్రితం ‘పోకిరి’ సినిమాతో కోట్లు ఆర్జించిన పూరి.. మళ్లీ ఇన్నాళ్లకు ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌తో నిర్మాతగా లాభాలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్ ఎనర్జిటిక్ నటన ఈ సినిమాకు హైలెట్. మరోవైపు నభా నటేశ్, నిధి అగర్వాల్ అందాలు బోనస్ వెరసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైయింది. అంతేకాదు చాలా రోజుల తర్వాతా మణిశర్మ సంగీతంలో వచ్చిన పాటలు సూపర్ హిట్టైయ్యాయి.

హై ఓల్టేజ్ మాస్ మసాలా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్‌కు గెలుపు దాహాన్ని తీర్చింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఢీలా పడిన పూరీకి ‘ఇస్మార్ట్ శంకర్’ విజయం ఉపశమనాన్ని ఇచ్చింది. అయితే పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ఫైనాన్సియల్ వ్యవహారాలన్నీ ఛార్మియే హ్యాండిల్ చేసింది. ఇ‘స్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్ మొదలుకొని బయ్యర్స్, సినిమా కొనుగోళ్ల వ్యవహారాలు ఛార్మి నే దగ్గరుండి అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది.
ఎలాగైనా మంచి మార్కెట్ రావాలని బయ్యర్లు తక్కువ ఇస్తామన్నా చార్మీ ఓకే అనేసిందట. తీరా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విడుదలయ్యాక సూపర్ డూపర్ హిట్ సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే బయ్యర్లకు డబుల్ లాభాలు వచ్చినా ఛార్మికి రావాల్సిన మొత్తం రావడం లేదని తెలుస్తోంది. కొందరు సిన్సియర్ గా ఛార్మికి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసారు. కానీ కొందరు మాత్రం ఛార్మికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారట. అలా రావలసిన మొత్తం కోట్లలో ఉందని అంటున్నారు.ఐతే ఛార్మికి ఇప్పుడు ఈ పరిస్థితి కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అంతేకాదు ఈ లెక్కలు ఛార్మికి తలనొప్పిగా మారిందని కథనాలు వెలువడుతున్నాయి.

ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్

ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్లో రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్
ట్రేడ్‌కు షాక్ ఇస్తున్న ఏడు చేపల కథ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి..
రాజు గారి గది 3 సెకండ్ డే కలెక్షన్స్.. సేఫ్ కావాలంటే..
‘సైరా’ 2 వీక్స్ కలెక్షన్స్ రిపోర్ట్.. బాక్సాఫీస్‌కు ఎదురీదుతున్న చిరంజీవి..
‘సైరా’ 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎదురీదుతున్న మెగాస్టార్..
‘సైరా’ 6 డేస్ కలెక్షన్స్.. వరసగా రెండోసారి 100 కోట్ల క్లబ్లో చిరంజీవి..
‘సైరా నరసింహా రెడ్డి’ 5 డేస్ కలెక్షన్స్.. ఐదో రోజు చిరంజీవి మెగా ప్రభంజనం..

Loading...