పూరీ జగన్నాథ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బాలయ్యతోనే చేస్తాడా..

నిన్నటి వరకు హిట్ కోసం మొఖం వాచిపోయినా పూరీ జగన్నాథ్.. తాజాగా రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత మరో లెక్క అని చెప్పొచ్చు. ఇక పూరీ జగన్నాథ్‌కు హిట్ లేని సమయంలో బాలకృష్ణ అతనికి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు.మరి ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ జగన్నాథ్.. ఇపుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను బాలకృష్ణతోనే చేస్తాడా అనే అనుమానాలు మొదలైయ్యాయి.

news18-telugu
Updated: July 19, 2019, 9:16 PM IST
పూరీ జగన్నాథ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ బాలయ్యతోనే చేస్తాడా..
బాలయ్య, పూరీ జగన్నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
నిన్నటి వరకు హిట్ కోసం మొఖం వాచిపోయినా పూరీ జగన్నాథ్.. తాజాగా రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్ తర్వాత మరో లెక్క అని చెప్పొచ్చు. ఇక పూరీ జగన్నాథ్‌కు హిట్ లేని సమయంలో బాలకృష్ణ అతనికి పిలిచి మరి సినిమా ఛాన్స్ ఇచ్చాడు. బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో పూరీ సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సినిమా బాక్సాాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. ఈ సినిమా సరిగా నడవపోయినా.. బాలయ్య మాత్రం పూరీకి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అది కూడా ఇస్మార్ట్ శంకర్ హిట్ అయితే అని కండిషన్స్ పెట్టాడు. మరి ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ జగన్నాథ్.. ఇపుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను బాలకృష్ణతోనే చేస్తాడా అనే అనుమానాలు మొదలైయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ ఫలితం రానంత వరకు ఒక లెక్క. సినిమా సక్సెస్‌తో కొత్త లెక్క మొదలైంది.

Ismart Shankar movie 1st day Worldwide Collections.. Ram movie sets fire at Box office pk.. అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సినిమాకు టాక్ ఎలా వ‌చ్చింద‌ని కాదు.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తున్నాయ‌నేది ఇంపార్టెంట్. మాస్ సినిమాల‌కు లాజిక్కుల‌తో ప‌ని లేదంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ మ‌రోసారి అది నిరూపించింది. ram pothineni,ram pothineni twitter,ismart shankar,ismart shankar twitter,ismart shankar collections,ismart shankar 1st day collections,ismart shankar first day collections,ismart shankar movie,ismart shankar collections,ismart shankar box office collection,ismart shankar movie first day collections,ismart shankar songs,ismart shankar movie review,ismart shankar 1st day worldwide box office collection,ismart shankar box office collections,ismart shankar review,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్,ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలెక్షన్స్,తెలుగు సినిమా
ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో


ఇక ‘నేను శైలజా’  సినిమా తర్వాత హిట్ కోసం వేచిచూచిన రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ తో అతనికో హిట్టు ఇచ్చిన తను కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇక సక్సెస్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌కు ఇపుడున్న యంగ్ హీరోల్లో ఎవరైన పిలిచి మరి దర్శకుడిగా అతని ఆఫర్ ఇస్తారా అనేది చూడాలి. ఇప్పటికే పూరీ జగన్నాథ్ కూడా మహేష్‌బాబు తనతో మూడో సినిమా చేస్తానని చెప్పి చేయకపోవడం పై ఎంతో మథన పడుతున్నాడు. ఇప్పటికే పూరీ కూడా తనకు మహేష్ కంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే ఇష్టం అంటూ చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది. అంతకు ముందు చిరంజీవి కూడా పూరీ జగన్నాథ్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. ఇపుడు తాజాగా చాలా ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ్ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇలాంటి సమయంలో తనకు ఫ్లాపులున్నా సరే తనకు ఒక ఛాన్స్ ఇచ్చిన బాలయ్యతో నెక్ట్స్ సినిమా చేసి మాట నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి. మొత్తానికి హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ జగన్నాథ్‌తో ఇపుడు సినిమాలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>