హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ చరణ్ విలన్ సినిమాను రీమేక్‌ చేస్తోన్న రామ్..

రామ్ చరణ్ విలన్ సినిమాను రీమేక్‌ చేస్తోన్న రామ్..

రామ్ చరణ్, రామ్

రామ్ చరణ్, రామ్

ప్రజెంట్ రామ్ .. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో హిట్టైన థడమ్ మూవీ రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు.

ఇంకా చదవండి ...

‘నేను శైలజా’ తర్వాత సరైన సక్సెస్ లేని రామ్.. ఆ తర్వాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేసిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాతో పలకరించినా ఈ సినిమా ఆశించినంత మేర సక్సెస్ కాలేదు. ప్రజెంట్ ఈ ఎనర్జిటిక్ స్టార్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా సక్సెస్‌ పై  రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్ కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌ పై ఉండగానే రామ్ మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.


After Ismart shankar Movie Ram to act Tamil super hit thadam Remake, ప్రజెంట్ రామ్ .. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో హిట్టైన థడమ్ మూవీ రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. Ram, Ram Ram Charan, Ram Ram Charan Villain, Ram Charan Arun Vijay Thadam To Remake with Ram, Ram Arun vijay Thadam Remake, Ram Thadam Remake, Ram Ismart Shankar, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా, రామ్ చరణ్ రామ్ అరుణ్ విజయ్, రామ్ అరుణ్ విజయ్ థడమ్ రీమేక్, అరుణ్ విజయ్ థడమ్ రీమేక్, రామ్ ఇస్మార్ట్ శంకర్ పూరీ జగన్నాథ్, టాలీవుడ్ న్యూస్, తెలుగు సినిమా
‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ ప్రారంభం


రీసెంట్‌గా తమిళంలో భారీ విజయాన్ని సాధించిన ‘థడమ్’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. రామ్ చరణ్ బ్రూస్లీ‌లో విలన్‌గా నటించిన అరుణ్ విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. చాలా లో బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ రూ. 15 కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ ఏర్పడింది. చివరకు ఈ సినిమా తెలుగు  రీమేక్ రైట్స్‌ను స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నాడు. ఈ సినిమాను రామ్ హీరోగా ఠాగూర్ మధు భాగస్వామిగా తెరకెక్కనుంది. మరి ఈ తెలుగు రీమేక్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన దర్శకుడే ఈసినిమాను డైరెక్ట్ చేస్తాడా లేకపోతే ఎవరైనా పెద్ద దర్శకుడితో ఈ సినిమాను తెరకెక్కిస్తాడా అనేది చూడాలి.


 


 

First published:

Tags: Arun Vijay, Kollywood, Ram, Ram Charan, Tamil Cinema, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు