హీరో రామ్, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ సినిమాతో హీరోగా రామ్‌కు హిట్ ఇవ్వడమే కాకుండా.. తాను కూడా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకున్నాడు పూరీ జగన్నాథ్. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల మోత మోగించింది. సూపర్ డూపర్ సక్సెస్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. డబుల్ దిమాక్‌తో రామ్ పోతినేని యాక్టింగ్ ఇరగ దీశాడు. హైదరాబాదీ యాసలో చెప్పిన ఊర మాస్ డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు. నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల విందుకు థియేటర్లో పూనకంతో ఊగిపోయారు యూత్. నేటితో ఈ సినిమా వంద రోజులు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ ట్వీట్ చేసాడు.
Missing you ram .. a special film in my life. Lov you for everything . We need to rock again 💪🏽💪🏽💪🏽💪🏽💪🏽 https://t.co/RIK3cMaiI8
— PURIJAGAN (@purijagan) October 25, 2019
ఈ సందర్భంగా రామ్ నిన్ను నేను మిస్ అవుతున్నాను. నా సినీ జీవితంలో ‘ఇస్మార్ట్ శంకర్’ స్పెషల్ సినిమా. మరోసారి మనద్దరం కలిసి పని చేద్దామని ట్వీట్ చేసాడు.మరోవైపు హీరోయిన్ ఛార్మి కూడా ఈ సినిమా వంద రోజలు పూర్తి చేసుకోవడంపై ట్వీట్ చేసింది. ఇస్మార్ట్ శంకర్ ఫలితంతో మేము పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు.
Tears rolling down while I watch this video 💕
We started with a dream , a huge dream ,
Gave our life to make it possible n today when we look back , we can proudly say
“ OUR DREAM CAME TRUE “
One of the craziest blockbuster of 2019#100days #ismartshankar
Thankful 🙏🏻 #PCfilm pic.twitter.com/Zt2PXqEX1f
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2019
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్..టాలీవుడ్‌కు పరిచయం కానుంది. మరోవైపు సల్మాన్‌తో హిందీలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత బాలయ్య ఒక సినిమా ఉండనే ఉంది. ఈ ప్రాజెక్టులు కంప్లీటైన తర్వాత మరోసారి పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ పట్టాలెక్కనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Charmy Kaur, Ismart Shankar, Puri Jagannadh, Ram Pothineni, Telugu Cinema, Tollywood