హోమ్ /వార్తలు /సినిమా /

ఇస్మార్ట్ శంకర్ హిట్... ఫీలవుతున్న మెగా హీరో

ఇస్మార్ట్ శంకర్ హిట్... ఫీలవుతున్న మెగా హీరో

ఇస్మార్ట్ శంకర్.. Photo: Twitter

ఇస్మార్ట్ శంకర్.. Photo: Twitter

ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన హిట్‌ను నిలబెట్టుకోవాలని పూరి కూడా పట్టుదలగా ఉన్నాడని సినీజనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ చూసి మెగా కాంపౌండ్‌కు చెందిన ఓ కుర్ర హీరో ఫీలవుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

    ఒక్క హిట్‌తో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌తో మళ్లీ పూరి జగన్నాధ్ ఫామ్‌లోకి వచ్చినట్టే అనే టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో వచ్చిన హిట్‌ను నిలబెట్టుకోవాలని పూరి కూడా పట్టుదలగా ఉన్నాడని సినీజనం చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ చూసి మెగా కాంపౌండ్‌కు చెందిన ఓ కుర్ర హీరో ఫీలవుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మెగా హీరో మరెవరో కాదు... సాయిధరమ్ తేజ్. పూరి జగన్నాధ్ తరహాలోనే వరుస ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసి చిత్రలహరి సినిమాతో యావరేజ్ హిట్‌ను అందుకున్న సాయిధరమ్ తేజ్‌కు అప్పట్లో పూరితో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని టాక్.


    అయితే తనలాగే ఫ్లాపుల్లో ఉన్న పూరితో సినిమా చేసేందుకు సాయిధరమ్ తేజ్ ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇస్మార్ట్‌ శంకర్‌ అంత పెద్ద హిట్‌ అవడంతో పూరిని తక్కువ అంచనా వేసినందుకు తేజ్‌ తెగ బాధ పడుతున్నాడని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూరితో సినిమా చేయకున్నా... ఆయనతో మంచి రిలేషన్ కొనసాగించి ఉంటే బాగుండేదని సాయిధరమ్ ఫీలవుతున్నాడని టాక్ వినిపిస్తోంది. అన్నీ బాగుంటే... ఇస్మార్ట్ శంకర్‌లో నటించే ఛాన్స్ తనకే వచ్చేదేమో అనే భావన కూడా సాయిధరమ్‌లో ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి గతంలో తనకు నో చెప్పిన సాయిధరమ్‌కు ఫ్యూచర్‌లో తనతో సినిమా చేసే ఛాన్స్ పూరి ఇస్తాడేమో చూడాలి.

    First published:

    Tags: Ismart Shankar, Puri Jagannadh, Sai Dharam Tej

    ఉత్తమ కథలు