టాలీవుడ్ మూవీతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా కియారా... 'కబీర్ సింగ్' తో జాతకమే మారిపోయిందిగా..

ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. తాజగా కబీర్ సింగ్ సక్సెస్‌తో కియారా బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌కు చేరుకుంది.

news18-telugu
Updated: July 20, 2019, 5:20 PM IST
టాలీవుడ్ మూవీతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా కియారా... 'కబీర్ సింగ్' తో జాతకమే మారిపోయిందిగా..
కియరా అద్వానీ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 20, 2019, 5:20 PM IST
ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. మహేష్ బాబు‌తో సినిమా  తరువాత తెలుగులో రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది . ఇక లేటెస్ట్ గా ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం 'కబీర్‌ సింగ్‌' విజయంతో అమ్మడి జతకమే మారిపోయింది. విజయ్ దేవరకొండ '‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని షాహిద్ కపూర్ లాంటి టాలెంటెండ్ నటుడితో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇండియాలో, ఓవర్సీస్ లో రిలీస్ అయిన ప్రతిచోట హిట్ టాక్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ఇక ఈ చిత్ర హీరో కెరీర్ బెస్టుగా నిలిచింది.

Kabir Singh 2nd Weekend Collections.. Shahid Kapoor movie earned towards Rs 200 Crore at Box Office,kabir singh,kabir singh box office collection,kabir singh rs 200 crores,kabir singh movie,kabir singh 3 days ww collection,kabir singh trailer,kabir singh weekend collection,kabir singh full movie,kabir singh 1st weekend collections,kabir singh movie songs,kabir singh box office,box office collection of kabir singh,kabir singh 100 crore,kabir singh collection,kabir singh song,kabir singh 2 days collection,bharat box office collection,kabir singh bgm,shahid kapoor,shahid kapoor kiara advani,arjun reddy kabir singh,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ 3 డేస్ కలెక్షన్స్,కబీర్ సింగ్ వీకెండ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కలెక్షన్స్,200 కోట్ల వైపు కబీర్ సింగ్,
కబీర్ సింగ్ పోస్టర్


కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటన అద్భుతం అంటూ, అలానే కియారా అద్వానీ తన అందచందాలతో కట్టిపడేసిందని కొనియాడుతున్నారు చూసిన ప్రేక్షకులు. అయితే ఈ చిత్రం కియారా క్రేజ్ ను మరింత పెంచేసి, బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేర్చేసింది. సినిమాల్లో బోల్డ్ నెస్ చూపించే కియారా, బికినీ లో కనిపించడానికి కూడా సై అంటుంది. అంతేకాదు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న కియారా ..బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని నిర్మొహమాటంగానే చేప్పేయడం ఈ భామను కొత్త హైట్స్ కు తీసుకెళ్లింది,ప్రస్తుతం ఈ భామ కోసం బాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీపికా, ప్రియాంక, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈమెకు క్రేజ్ పెరిగింది.ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ తో రెండు పెద్ద సినిమాలకి ఇప్పటికే సైన్‌ చేసిన కియారా .. అమాంతం పారితోషకాన్ని పెంచేసిందని సమాచారం.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...