ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్నెస్తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా, ఆ తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. మహేష్ బాబుతో సినిమా తరువాత తెలుగులో రామ్ చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రంలో నటించింది . ఇక లేటెస్ట్ గా ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం 'కబీర్ సింగ్' విజయంతో అమ్మడి జతకమే మారిపోయింది. విజయ్ దేవరకొండ '‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని షాహిద్ కపూర్ లాంటి టాలెంటెండ్ నటుడితో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేశారు సందీప్ రెడ్డి వంగ. ఇండియాలో, ఓవర్సీస్ లో రిలీస్ అయిన ప్రతిచోట హిట్ టాక్ తెచ్చుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ఇక ఈ చిత్ర హీరో కెరీర్ బెస్టుగా నిలిచింది.

కబీర్ సింగ్ పోస్టర్
కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటన అద్భుతం అంటూ, అలానే కియారా అద్వానీ తన అందచందాలతో కట్టిపడేసిందని కొనియాడుతున్నారు చూసిన ప్రేక్షకులు. అయితే ఈ చిత్రం కియారా క్రేజ్ ను మరింత పెంచేసి, బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేర్చేసింది. సినిమాల్లో బోల్డ్ నెస్ చూపించే కియారా, బికినీ లో కనిపించడానికి కూడా సై అంటుంది. అంతేకాదు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న కియారా ..బోల్డ్ పాత్రల్లో నటించేందుకు ముద్దు సీన్స్ చేసేందుకు ఎలాంటి మొహమాటం లేదని నిర్మొహమాటంగానే చేప్పేయడం ఈ భామను కొత్త హైట్స్ కు తీసుకెళ్లింది,ప్రస్తుతం ఈ భామ కోసం బాలీవుడ్ లో చాలామంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీపికా, ప్రియాంక, అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ లు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈమెకు క్రేజ్ పెరిగింది.ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో రెండు పెద్ద సినిమాలకి ఇప్పటికే సైన్ చేసిన కియారా .. అమాంతం పారితోషకాన్ని పెంచేసిందని సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 20, 2019, 17:20 IST