మాస్ మహారాజాతో రీమేక్ రాజా.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రవితేజ..

వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా దీపావళి సందర్భంగా గోపీచంద్ మలినేనితో ప్రాజెక్ట్ ఓకే చేసిన మాస్ మహారాజ్..తాజాగా మరో క్రేజీ డైరెక్టర్‌తో ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: October 28, 2019, 7:43 PM IST
మాస్ మహారాజాతో రీమేక్ రాజా.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రవితేజ..
‘డిస్కోరాజా’లో రవితేజ Instagram/raviteja_2628
  • Share this:
వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌టికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు. తాజాగా దీపావళి సందర్భంగా గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. ఈ సినిమాతో పాటు రవితేజ.. రీసెంట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ రీమేక్ తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో నెక్ట్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.

after gopichand malineni movie raviteja to act rakshasudu fame ramesh varma direction here are the details,ramesh varma,ramesh varma hit movies,ravi teja,ramesh varma movies,director ramesh varma exclusive interview,hyper aadi,anasuya,jabardasth comedy show,raviteja twitter,raviteja instagram,raviteja facebook,karthika deepam,director ramesh varma about bellamkonda sreenivas,ravi teja movies,raviteja fires on media,raviteja movies,raviteja fans,raviteja fires on social media,raviteja power movie,raviteja,raviteja songs,malvika sharma,sudheer varma,singanamala ramesh,director sudheer varma speech,allari naresh,ramesh varma raviteja,tollywood,telugu cinema,రవితేజ,గోపిచంద్,రవితేజ రమేష్ వర్మ,రవితేజ డిస్కోరాజా,రవితేజ రమేష్ వర్మ,రవితేజ రమేష్ వర్మ,రవితేజ గోపీచంద్ మలినేని
రమేష్ వర్మ్ దర్శకత్వంలో రవితేజ (Facebook/Photos)


త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఇపుడు చేయబోతున్న సినిమాలతోనైనా.. హీరోగా హిట్ ట్రాక్ ఎక్కి హీరోగా తన మాస్ పవర్ చూపిస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 28, 2019, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading