దర్శకుడు హరీష్ శంకర్.. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ టైటిల్‌తో ఒక సినిమాను తెరకెక్కించిన సంగతి తెలసిందే కదా. ఈ సినిమా టైటిల్ విషయంలో వాల్మీకి బోయలు అభ్యంతరం తెలపడంతో పాటు హైకోర్టు కూడా పేరు మార్చమని చెప్పడంతో ‘వాల్మీకి’ సినిమా కాస్తా ‘గద్దలకొండ గణేష్’ అయింది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హరీష్ శంకర్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న విజయ్ దేవరకొండకు హరీష్ శంకర్ ఒక కథ ఉంది మీకు చెబుతా అని మెసేజ్ చేసా. దానికి విజయ్ దేవరకొండ..తాను రెండేళ్ల వరకు ఫుల్ బిజీగా ఉన్నా.. తర్వాత కలువు అని విజయ్ దేవరకొండ అన్న విషయాన్ని 0 హరీష్ శంకర్ గుర్తు చేసుకున్నాడు.
‘గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ (Twitter/Photo)
విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్. ఆయన తనపై వస్తున్న విమర్శలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో ఇవన్ని కామన్. విజయ్ దేవరకొండ కూడా తనపై వస్తున్న పట్టించుకోకుండా ఉంటే సరిపోతుందన్నారు. ఏమైనా అవకాశం వస్తే మాత్రం విజయ్ దేవరకొండతో తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఈ సందర్భంగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.