AFTER ELECTION COMMISSION RESTRICTIONS LAKSHMIS NTR MOVIE WILL RELEASE ON MAY 1 IN ANDHRA PRADESH TA
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై కొనసాగుతున్న హై డ్రామా.. అసలు విడుదలవుతుందా..
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల
మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో కాకుండా మిగతా అన్ని ఏరియాల్లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. న్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఈసినిమా విడుదల చేయకూడదంటూ ఏప్రిల్ 10న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా.ఈ సందర్భంగా నిర్మాతలు మే 1న సినిమా విడుదల అంటూ ప్రకటనలు ఇచ్చారు. దీంతో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.
మొత్తానికి వివాదాలతో మొదలైన రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో కాకుండా మిగతా అన్ని ఏరియాల్లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను విలన్గా చూపెట్టడం.. దానికి టీడీపీ శ్రేణులు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఈ సినిమా విడుదలపై నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్కు విడిచిపెట్టింది. ఇక ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు ఈసినిమా విడుదల చేయకూడదంటూ ఏప్రిల్ 10న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఏపీలో ఎన్నికలు ముగిసిన.. మొత్తంగా మే 23 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు ఈ సినిమా విడుదల చేయడం కుదరదనేది ఎన్నికల కమిషన్ వాదన.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో
కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి మాత్రంఈ సినిమాను మే 1న ఏపీలో విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటనలిచ్చారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే సినిమా విడుదలకు సిద్దం అయ్యారు. దీంతో అసలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అసలు మే 1న విడుదల అవుతుందా లేదా అనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.