హోమ్ /వార్తలు /సినిమా /

Samantha : విడాకుల తర్వాత సమంత అప్పుడే సొంత కుంపటి.. వైరల్ అవుతోన్న న్యూస్..

Samantha : విడాకుల తర్వాత సమంత అప్పుడే సొంత కుంపటి.. వైరల్ అవుతోన్న న్యూస్..

Samantha Photo : Instagram

Samantha Photo : Instagram

Samantha : సమంత, నాగ చైతన్యలు భార్య భర్తలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ నిర్ణయంతో అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ షాక్‌కు గురైయారు. అయితే విడాకుల తర్వాత సమంత ముంబైకి షిప్ట్ అవుతారని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..

ఇంకా చదవండి ...

  Samantha : సమంత తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. అయితే ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. విడాకుల తర్వాత వారు సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. ఇక అది అలా ఉంటే సమంత విడాకుల తర్వాత ముంబైకి షిఫ్ట్ కానుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అదంతా ఏమి లేదని తెలుస్తోంది. ఆమె ముంబైకి వెళ్లట్లేదని తాజా టాక్. సమంత హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఆమె తాజాగా గచ్చిబౌళీలో ఖరీదైన ఫ్లాటును కొన్నట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడే ఒంటరిగా నివసించనుందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  Prabhas : ఆ సినిమా కోసం ప్రభాస్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్... పది పెద్ద సినిమాలు తీయ్యోచ్చు...


  ఈ సినిమా ఇటీవల షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. పౌరాణిక నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ఈ సినిమాలో చూపించనున్నారు గుణ శేఖర్. దీన్ని మహాభారతంలోని ఆదిపర్వం నుండి దీన్ని తీసుకున్నారు దర్శకుడు. ఈ రమణీయ ప్రేమకావ్యంలో సమంతకు (Samantha )జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు.


  Rashmi Gautam: గుంటూరు మిర్చి కంటే ఘాటు.. చెమటలు పట్టిస్తోన్న రష్మి గౌతమ్ అందాలు..

  ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు. అల్లు అర్హ (Allu Arha) ఈ సినిమాలో చిన్నారి ప్రిన్స్ భరతుడి పాత్రలో కనిపించనుందని సమాచారం. గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

  ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ తమిళ సినిమాను చేస్తున్నారు. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో కాకుండా డిస్నీ హాట్ స్టార్‌లో డైరెక్టు రిలీజ్ కానుందని తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Samantha Ruth Prabhu, Tollywood news

  ఉత్తమ కథలు