హోమ్ /వార్తలు /సినిమా /

‘డిస్కోరాజా’ తర్వాత రవితేజ ఆ సీక్వెల్‌‌ చేస్తాడా..

‘డిస్కోరాజా’ తర్వాత రవితేజ ఆ సీక్వెల్‌‌ చేస్తాడా..

రవితేజ ఫైల్ ఫోటో

రవితేజ ఫైల్ ఫోటో

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పట్టడం కన్నా..పాత స్టోరీలనే అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్‌గా చుట్టేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. తాజాగా టాలీవుడ్‌లో మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్.

ఇంకా చదవండి ...

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పట్టడం కన్నా..పాత స్టోరీలనే అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్‌గా చుట్టేస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. తాజాగా టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.


బాలీవుడ్‌లో గోల్‌మాల్, హౌస్‌ఫుల్, ధమాల్ వంటి కామెడీ సినిమాల సిరీస్ మాదిరిగా తెలుగులో ‘ఎఫ్2’  కామెడీ సినిమాకు సీక్వెల్స్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే కదా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ను దాటి రూ.150 కోట్ల గ్రాస్‌ను అందుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నైజాంలో రూ.20 కోట్లకు పైగానే రాబట్టింది.


తాజాగా ‘ఎఫ్ 2’ సినిమాకు సీక్వెల్‌గా  ‘ఎఫ్ 3’ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్‌ను కూడా దిల్ ‌రాజు నిర్మించే అవకాశాలున్నాయి.  ఈ సీక్వెల్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు జోడిగా రవితేజను మరో హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.  కామెడీ చేయడంలో రవితేజ స్టైల్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వెంకీ, వరుణ్‌లకు తోడుగా రవితేజ యాడ్ అయితే థియేటర్స్‌లో ఏ రేంజ్‌లో నవ్వులు పూస్తాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మరి మాస్ రాజా..‘ఎఫ్3’ సీక్వెల్‌కు ఓకే చెబుతాడా ? లేదా అనేది చూడాలి.


2019 కింగ్ ఫిషర్ క్యాలెండర్ 



ఇవి కూడా చదవండి 


చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్..అందరు దాని బాధితులే..


చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..


అమితాబ్ నిజంగా ఆ సాహసం చేస్తున్నాడా..ఫ్యాన్స్‌కు బిగ్‌ బీ బిగ్ షాక్


 

First published:

Tags: Anil Ravipudi, Dil raju, Raviteja, Tollywood, Varun Tej, Venkatesh

ఉత్తమ కథలు