ధనుష్ రూటులో హాలీవుడ్ బాట పడుతున్న మరో స్టార్ హీరో..

ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మన పెద్దవాళ్లు. ఇపుడు మన హీరోలు అదే పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్క హీరో ..రెండు సినిమాలు చేయడమో లేదో పక్క ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెడుతున్నారు. తాజాగా ధనుష్ బాటలో మరో స్టార్ హీరో హాలీవుడ్ బాట పడుతున్నాడు.

news18-telugu
Updated: September 24, 2019, 2:48 PM IST
ధనుష్ రూటులో హాలీవుడ్ బాట పడుతున్న మరో స్టార్ హీరో..
ధనుష్ (File Photo)
  • Share this:
ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మన పెద్దవాళ్లు. ఇపుడు మన హీరోలు అదే పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఒక్క హీరో ..రెండు సినిమాలు చేయడమో లేదో పక్క ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ధనుశ్.. ‘ది ఎక్స్  ట్రార్డినరీ జర్నీ ఆప్ ఎ ఫకిర్ హూ గాట్ ట్రాప్డ్ ఇన్ ఆన్ ఐకియా కప్ బోర్డ్’ అనే హాలీవుడ్ సినిమాలో ధనుష్ హీరోగా యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన జీ.వి.ప్రకాష్ ప్రస్తుతం సంగీత దర్శకుడు కంటే హీరోగానే రాణిస్తున్నాడు. ఇప్పటికే తమిళంలో ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన ఇపుడు హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

after dhanush famous tamil music director cum hero gv prakash to act in hollywood movie,dhanush,dhanush hollywood movie,gv prakash,gv prakash hollywood,dhanush gv prakash,gv prakash act in hollywood movie,dhanush twitter,dhanush instagram,dhanush fb,dhanush facebook, gv prakash twitter, gv prakash instagram, gv prakash fb, gv prakash facebook,kollywood,hollywood,bollywood,tollywood,ధనుష్,ధనుష్ హాలీవుడ్ మూవీ,జీవి ప్రకాష్ హాలీవుడ్ మూవీ,జీవి ప్రకాష్ హాలీవుడ్ మూవీ ఛాన్స్,హాలీవుడ్ మూవీలో జీవి ప్రకాష్,
ధనుశ్ రూటులో హాలీవుడ్ బాట పట్టిన జీవీ ప్రకాష్ (Twitter/Photos)


‘డెవిల్ నైట్’ అనే సినిమాను నిర్మించిన డెల్ గణేశన్ తను నిర్మించబోయే నెక్ట్స్ హాలీవుడ్ మూవీ ‘ట్రాప్ సిటీ’ చిత్రంలో జీవి ప్రకాష్ హీరోగా నటిస్తున్నాడు. రికీ పర్చల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రముఖ ఇంగ్లీష్ నటుడు జాన్సన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. త్వరలనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తారట.

 

First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>