పవన్, మహేష్‌లను కలవరపెడుతున్న రాజమౌళి నిర్ణయం..

అవును దర్శక బాహుబలి రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో ఇపుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలవరపడుతున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 6, 2020, 11:12 AM IST
పవన్, మహేష్‌లను కలవరపెడుతున్న రాజమౌళి నిర్ణయం..
పవన్ కళ్యాణ్,రాజమౌళి, మహేష్ బాబు (Twitter/Photo)
  • Share this:
అవును దర్శక బాహుబలి రాజమౌళి తీసుకున్న నిర్ణయంతో ఇపుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలవరపడుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను ఈ యేడాది జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం.. ఒకేసారి 10కి పైగా భాషల్లో డబ్ చేసిన రిలీజ్ చేయడం.. గ్రాఫిక్స్‌తో పాటు మంచి క్వాలిటీతో సినిమాను అందిచాలనే ఉద్దేశ్యంతో   ఈ సినిమాను రాజమౌళి వచ్చే 2021 జనవరి 8న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో వచ్చే యేడాది సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలనుకున్న హీరోలకు కలవర పాటుకు గురువుతున్నారు. బాహుబలి సిరీస్ రాజమౌళి సినిమాలకు దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో డిమాండ్ పెరిగింది. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు  నటించడం వంటి కారణాలతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

after declared rajamouli rrr release date pawan kalyan mahesh babu get upset here are the details,rrr,rrr release date,rrr release on january 2021,rrr twitter,rrr instagram,rrr facebook,rrr rajamouli,rrr rajamouli ram charan jr ntr,rrr pawan kalyan krish movie,rrr mahesh babu vamsi paidipally movie,rrr mahesh babu,rrr pawan kalyan,bollywood,tollywood,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్,8 జనవరి 2021 ఆర్ఆర్ఆర్ రిలీజ్,ఆర్ఆర్ఆర్ పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి
రాజమౌళి నిర్ణయంతో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలవర పాటు (Twitter/Photo)


రాజమౌళి షాకింగ్ నిర్ణయంతో ఇప్పటికే టాలీవుడ్‌లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్న సినిమాల పరిస్థితి అయోమయంగా మారింది. ఇటీవలె సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హిట్టు అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. నెక్ట్స్ వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాను వచ్చే పొంగల్‌కు విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రకటనతో మహేష్ బాబు తన సినిమా ఆర్ఆర్ఆర్‌ సినిమాతో పోటీ పడాల వద్దా అనే డైలమాలో ఉన్నట్టు సమాచారం.

మహేష్ బాబు, వంశీ పైడిపల్లి (Twitter/Photo)




గతంలో బాహుబలి 1 సినిమా విడుదల సందర్భంగా శ్రీమంతుడు సినిమాను నాలుగు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేసాడు. ఇపుడు కూడా ఆర్ఆర్ఆర్‌కు ఎదురెళ్లే సాహసం మహేష్ బాబు చేయకపోవచ్చనే చెప్పొచ్చు. ఐతే ఈ చిత్రాన్ని మహేష్ బాబు క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు.

after declared rajamouli rrr release date pawan kalyan mahesh babu get upset here are the details,rrr,rrr release date,rrr release on january 2021,rrr twitter,rrr instagram,rrr facebook,rrr rajamouli,rrr rajamouli ram charan jr ntr,rrr pawan kalyan krish movie,rrr mahesh babu vamsi paidipally movie,rrr mahesh babu,rrr pawan kalyan,bollywood,tollywood,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్,8 జనవరి 2021 ఆర్ఆర్ఆర్ రిలీజ్,ఆర్ఆర్ఆర్ పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,ఆర్ఆర్ఆర్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అజయ్ దేవ్‌గణ్,ఆర్ఆర్ఆర్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి
RRR రిలీజ్ డేట్ పోస్టర్ (Twitter/Photo)


మరోవైపు పవన్ కళ్యాణ్.. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస పెట్టి సినిమాలు ఓకే చేస్తూ పోతున్నాడు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్‌ను స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించడం..అందులో తన అన్న కొడుకు రామ్ చరణ్ హీరో కావడం వంటి కారణాలతో పవన్ కల్యాణ్ తన సినిమాను దీపావళికి తన సినిమా రిలీజయ్యేలా క్రిష్‌కు సూచించినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్, క్రిష్ (Twitter/Photo)


ఇక రాజమౌళి కూడా 2021 సంక్రాంతికి ముందుగా తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసి మంచి పనిచేసారని  ఇండస్ట్రీ వాళ్లు చెప్పుకుంటున్నారు. దాంతో వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనకున్న సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకునే ఆప్షన్ రాజమౌళి ఇచ్చాడు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ దెబ్బకు వేరే సినిమాలు రిలీజయ్యే పరిస్థితి ఇటు తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లో కోలీవుడ్‌లో లేదనే చెప్పాలి.
First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు