Home /News /movies /

AFTER CORONA AND TICKET RATES HIKE NOW ANOTHER BLOW FOR TOLLYWOOD FILM INDUSTRY BA

తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో భయంకరమైన దెబ్బ.. అప్పుడు కరోనా, తర్వాత టికెట్ రేట్లు.. ఇప్పుడు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొదట కరోనా, ఆ తర్వాత టికెట్ రేట్లు దెబ్బకొడితే ఇప్పుడు వర్షాలు నిర్మాతల పాలిట శాపంగా మారాయి. వర్షాల వల్ల తెలంగాణ, ఏపీల్లో కూడా జనం బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. వర్షాలు ఎప్పుడూ ఉంటాయా అనుకోవచ్చు. కానీ ఓ విషయం గుర్తుంచుకోవాలి.

ఇంకా చదవండి ...
    తెలుగు సినిమా ఇండస్ట్రీకి భయంకరంగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకటి వదిలిందనుకుంటే మరొకటి వెంటపడుతోంది. కరోనా వైరస్ కారణంగా ఏకంగా రెండేళ్ల పాటు నష్టపోయింది. చాలా సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. నిర్మాతలు దెబ్బతిన్నారు. సినీ పరిశ్రమ మీద ఆధారపడిన అన్ని రంగాల వారు భయంకరంగా నష్టపోయారు. చివరకు కరోనా రెండు వేవ్‌ల తర్వాత విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హమ్మయ్య ఇక గాడిన పడుతుందని భావించారు. అయితే, కరోనా కారణంగా నష్టపోయిన డబ్బంతా ఒకే దెబ్బతో జనం నుంచి రాబట్టుకుందామనుకున్న నిర్మాతల అతి తెలివితేటల వల్ల మరో దెబ్బ పడింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న పెద్ద పెద్ద హీరోల సినిమాలు కావడంతో అభిమానులు, సినిమా పిచ్చోళ్లు ఎగబడి చూస్తారనుకుని నిర్మాతలు అత్యాశకు పోయి సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. రకరకాల కారణాలు చూపించిన రేట్లు పెంచుకున్నారు. దీంతో మొదటికే మోసం వచ్చింది.

    రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి సినిమాలు ఏకంగా కౌంటర్లోనే రూ.350 వరకు విక్రయించారు. ఒక్కో టికెట్ రూ.350 అంటే నలుగురు వెళ్లాలంటే సుమారు రూ.1500 ఖర్చు వస్తుంది. ఆ తర్వాత ఎఫ్ 3 అయితే రూ.290, నాని నుంచి వచ్చిన అంటే సుందరానికి సినిమా టికెట్ రేట్లు కూడా కొద్దో గొప్పో పెరిగాయి. దీంతో జనం సిల్వర్ స్క్రీన్‌కి దండం పేట్టేశారు. ఇన్ని రోజులు ఆగిన వాళ్లం.. మరో కొన్ని రోజులు ఆగలేమా అంటూ జనం ధియేటర్లకు రావడం మానేశారు. అసలే కరోనా కాలంలో జేబులు గుల్ల చేసుకున్నది చాలు.. మళ్లీ ధియేటర్లకు వెళ్లి పాకెట్ ఖాళీ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించారు. దీంతో నిర్మాతల ప్లాన్ రివర్స్ అయింది.

    Sudheer Rashmi: సుధీర్, రష్మీ లవ్ ట్రాక్.. ప్రతీ షోలో ఎవరు చేయిస్తారో తెలుసా?


    మొదట కరోనా, ఆ తర్వాత టికెట్ రేట్లు దెబ్బకొడితే ఇప్పుడు వర్షాలు నిర్మాతల పాలిట శాపంగా మారాయి. వర్షాల వల్ల తెలంగాణ, ఏపీల్లో కూడా జనం బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. వర్షాలు ఎప్పుడూ ఉంటాయా అనుకోవచ్చు. కానీ ఇది వర్షాకాలం సీజన్. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే మెరుగ్గానే ఉండొచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.



    రాబోయే రోజుల్లో రామ్ పోతినేని - ది వారియర్ సినిమా ఉంది. ఆ తర్వాత రెండు జడల సీత, సీతాయణం, వద్దురా సోదరా లాంటి చిన్న సినిమాలు ఉన్నాయి. విశాల్ లాఠీ కూడా ఈ నెలలోనే ఉంది. రామ్ సినిమాకు తెలంగాణలోని మల్టీ ప్లెక్స్‌ల్లో టికెట్ రేటు రూ.295 ఉంది. ఏపీలో అయితే రూ.177 ఉంది. మరి వర్షాల్లో ఈ రేట్లు పెట్టి టికెట్లు కొంటారా? ధియేటర్లు నిండుతాయా? అనేది డౌటే.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Tollywood, Tollywood Cinema

    తదుపరి వార్తలు