హోమ్ /వార్తలు /సినిమా /

అయ్యో పాపం రవితేజను చూస్తే జాలేస్తోంది...‘డిస్కోరాజా’ కోసం దిగజారిన మాస్ రాజా

అయ్యో పాపం రవితేజను చూస్తే జాలేస్తోంది...‘డిస్కోరాజా’ కోసం దిగజారిన మాస్ రాజా

రవితేజ (ఫైల్ ఫోటో)

రవితేజ (ఫైల్ ఫోటో)

‘రాజా ది గ్రేట్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. వరుసగా చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఒకప్పుడు సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేసే మాస్ రాజా..ఇపుడిపుడే పరిస్థితులు అర్థమై దిగి వస్తున్నాడు.

ఇంకా చదవండి ...

గత కొన్నేళ్లుగా రవితేజ తన రేంజ్‌ తగ్గ హిట్ అందించలేపోతున్నాడు. ‘బెంగాల్ టైగర్’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు.


ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత..వరుసగా చేసిన ‘టచ్ చేసి చూడు’, ‘‘నేల టిక్కెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఒకప్పుడు సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ విషయంలో బెట్టు చేసే మాస్ రాజా..ఇపుడిపుడే పరిస్థితులు అర్థమై దిగి వస్తున్నాడు. వరుస ప్లాపులు రవితేజ మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి.


After Continues Flops Raviteja remuneration Reduced, Ravi Teja Remuneration cut, Ravi Teja, Raviteja Remuneration, Raviteja Disco Raja Remumeration Reduced, Ravi Teja pay cut, Ravi Teja next movie, రవితేజ, డిస్కోరాజా, రవితేజ డిస్కోరాజా, డిస్కోరాజా మాస్ రాజా రవితేజ, రవితేజ తర్వాత సినిమా, రవితేజ రెమ్యూనరేషన్ కోత,
రవితేజ ఫ్లాప్ మూవీలు


‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా కోసం దాదాపు రూ. పది కోట్టను తీసుకునే రవితేజ..ఇపుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో చేస్తోన్న ‘డిస్కోరాజా’ సినిమా కోసం కేవలం రూ.ఐదు కోట్లనే ఛార్జ్ చేసినట్టు సమాచారం.


 


ఈ సినిమాలో రవితేజ..ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో చేయనటి వంటి డిఫరెట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వృద్దుడిగా ఉండే రవితేజ..ఆ తర్వాత యువకుడిగా మారి తనకు అన్యాయం చేసిన వాళ్లపై పగ తీర్చుకుంటాడు. అంతేకాదు ‘డిస్కోరాజా’ టైటిల్‌లో సీతాకోక చిలుకను చూపించినట్టు రవితేజ..అతడి జీవితంలో వివిధ దశలను ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.


మొత్తానికి రవితేజ కెరీర్ గాడిన పడాలంటే ‘డిస్కోరాజా’ సినిమా విజయం సాధించాల్సిందే. రవితేజకు మరో ఆప్షన్ కూడా లేదు. ఏదైనా తేడా జరిగి డిస్కో రాజా గాడి తప్పితే రవితేజను పూర్తిగా మర్చిపోవచ్చు.

ఇవి కూడా చదవండి 


తమన్నా ఇండియన్ కాదా..పాకిస్థానా ?


మహేష్ బాబు స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా..


ముగిసిన ‘వినయ విధేయ రామ’ థియేట్రికల్ రన్..ఇంతకీ ఎంత కలెక్ట్ చేసిందంటే..

First published:

Tags: Raviteja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు