మొన్న చిరంజీవి.. ఇపుడు పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఏం చేసారో తెలుసా..

మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. ఇపుడు సేద తీరుతున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఏమైతే చేసాడో..ఇపుడు పవన్ కళ్యాణ్ అదే పని చేసాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 17, 2019, 12:57 PM IST
మొన్న చిరంజీవి.. ఇపుడు పవన్ కళ్యాణ్.. ఇంతకీ ఏం చేసారో తెలుసా..
చిరంజీవి పవన్ కళ్యాణ్ (Chiranjeevi Pawan Kalyan)
  • Share this:
అవును కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉంటే.. పవన్ కళ్యాన్ సినిమాలతో తీరిక లేకండా ఉండేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఇపుడు మెగాస్టార్ మాత్రం..వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఫలితాల కోసం నెలన్నరకు పైగా టైమ్ ఉంది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ .. ఇపుడు సేద తీరుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్..ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. చూడటమే కాదు. ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్‌కు ప్రశంసలు కురిపించడమే కాదు..మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఒక బొకే పంపించాడు.

after chiranjeevi, pawan kalyan watched chitralahari movie..and praises sai dharam tej acting,pawan kalyan,pawan kalyan watched chitralahari movie,chiranjeevi watched chitralahari movie,pawan kalyan twitter,chiranjeevi twitter,pawan kalyan chiranjeevi sai dharam tej chitralahari,pawan kalyan chiranjeevi watched sai dharam tej chitralahari movie,chitralahari movie collection,chitralahari movie twitter,chitralahari movie collections,sai dharam tej,andhra pradesh news,andhra pradesh politics,pawan kalyan janasena,jabardasth comedy show,tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,చిరంజీవి,సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి మూవీ చూసిన పవన్ కళ్యాణ్,చిత్రలహరి మూవీని ప్రశంసించిన చిరంజీవి,చిరంజీవి పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి,కిషోర్ తిరుమల,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
చిత్రలహరి మూవీ ఫోటో


ఇక పవన్ కళ్యాణ్ కంటే ముందు చిరంజీవి కూడా ‘చిత్రలహరి’ సినిమా చూసి సాయి ధరమ్ తేజ్‌నటనను మెచ్చుకున్నాడు. మరోవైపు చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర దర్శక,నిర్మాతలకు అభినందనలు తెలియ జేసాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని,నివేథా పెతురాజ్‌లు హీరోయిన్స్‌‌గా నటించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్న సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభల పంట పండించింది. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.20 కోట్ల గ్రాస్..రూ.14 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి  ‘చిత్రలహరి’ సక్సెస్.. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు  ఈ సినిమాలో నటించిన ప్రతి టెక్నీషియన్ కెరీర్‌కు ప్రాణం పోసింది.
First published: April 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading