తెలుగులో రాజమౌళి తర్వాత అపజయం అంటూ ఎరగక వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. అంతేకాదు తీసే ప్రతి చిత్రంలో ఏదో సామాజిక సందేశం ఇవ్వడం కొరటాల శివ ప్రత్యేకత. మొదటి సినిమా మిర్చిలో నరుక్కుంటూ పోతే ఎవరు మిగలరు. ప్రేమించడం కూడా నేర్చుకోవాలంటూ సందేశం ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన ‘శ్రీమంతుడు’ సినిమాలో సమాజం నుంచి తీసుకోవడమే కాదు.. ఎంతో కొంతో తిరిగి ఇవ్వాలనే సందేశం ఇచ్చాడు. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో పర్యావరణాన్ని రక్షించడంతో పాటు సమాజంతో జరిగే చెడును కూడా మెకానిక్ తరహాలో బాగు చేయాలని చూపెట్టాడు. ఆ తర్వాత ‘భరత్ అను నేను’ సినిమాలో ఒక ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలో చూపెట్టాడు. తాజాగా చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాలో దేవాలయాను పట్టించుకోకపోతే.. సమాజం ఎలా చెడువైపు వెళతుందో చూపెట్టనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగితో పాటు నక్సలైట్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా కొరటాల శివ ప్యాన్ ఇండియా లెవల్లో తెరెక్కించనున్నాడు.ఈ సినిమా తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్‌తో నెక్ట్స్ మూవీ చేసేందకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

అల్లు అర్జున్, కొరటాల శివ (Twitter/Photo)
ఇప్పటికే కొరటాల శివ చిరంజీవి సినిమా తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇప్పట్లో వీళ్లు ఆయా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్, రాధేశ్యామ్ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా తర్వాత ఓమ్ రౌత్‌తో ఓ బాలీవుడ్ మూవీ చేయడానికి కమిటయ్యాడు. ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వరుసగా త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, అట్లీ లతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. అటు రామ్ చరణ్... కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత విక్రమ్ కుమార్, వంశీ పైడిపల్లితో పాటు మరో కొత్త దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు.

కొరటాల శివ,ఎన్టీఆర్, ప్రభాస్,చరణ్ (Twitter/Photos)
ఈ లోగా అల్లు అర్జున్.. సుకుమార్ ‘పుష్ప’ తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ తప్పించి వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు. ఇంకోవైపు అల్లు అర్జున్.. యాత్ర ఫేమ్ మహి.వి. రాఘవ్‌తో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్‌తో చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 17, 2020, 12:39 IST