చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పూర్తయ్యేలోపు సినిమా ఇండస్ట్రీపై టీడీపీ కసి మొత్తం తీర్చుకునేలా కనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీపై వార్నింగుల వర్షం కురిపిస్తున్నారు ఏపీ మంత్రులు, రాజకీయ నేతలు. ఇన్నాళ్లూ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు సినిమా ఇండస్ట్రీపై నిప్పులు కురిపించారు. వెళ్లి కేసీఆర్ కాళ్లు మొక్కుతామంటే మొక్కండి.. ఊడిగం చేసుకోండి.. బాన్ చంద్ కాల్మొక్కుతా అంటూ అడుక్కోండి అంతేకానీ ఏపీలో మీ నాటకాలు సాగవంటూ ఫైర్ అయ్యాడు.
చంద్రబాబు నాయుడు
ఇక ఇప్పుడు ఈయన వారసత్వాన్నే తనయుడు కూడా తీసుకున్నాడు. తాజాగా నారా లోకేష్ సైతం సినిమా ఇండస్ట్రీపై విమర్శల వర్షం కురిపించాడు. తనను మంగళగిరిలో ఓడించడానికి వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తుందని చెప్పాడు ఈయన. అక్కడితో ఆగకుండా తన ఓటమి కోసం జగన్ పార్టీ అద్దె తారలను రంగంలోకి దింపుతుందని చెప్పాడు లోకేష్.
నారా లోకేష్..(Image: Facebook)
ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో చాలా మంది సినిమా నటులు ఉన్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. దాదాపు డజన్ మందికి పైగానే ఈ మధ్య కాలంలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లను టార్గెట్ చేస్తూ బాబు కూడా విమర్శల వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కూడా ఇదే చేస్తున్నాడు. మొత్తానికి లోకేష్ వ్యాఖ్యలతో తెలియకుండానే తెలుగుదేశం పార్టీకి సినిమా వాళ్లకు దూరం పెరిగిపోతుంది.
ఇది కూడా చూడండి:-
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.