
కియారా అద్వానీ (ఫైల్ ఫోటో)
ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్నెస్తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. తాజాగా ఈ భామ బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లోని క్రేజీ యంగ్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. అందం, అభినయం మాత్రమే కాదు తన స్టైల్, బోల్డ్నెస్తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది ఈ యంగ్ బ్యూటీ. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన 'భరత్ అనే నేను’తో ఎంట్రీ ఇచ్చిన కైరా అడ్వాణీ తొలి సినిమా అయినప్పటికీ తన నటన, అందచందాలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగింది. ఆ తర్వాత వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ నిరాశపరిచినా ఆమె డిమాండ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో ‘కబీర్‌సింగ్’ సక్సెస్‌తో అక్కడి బడా సంస్థలు కియారా డేట్ల కోసం పోటీ పడుతున్నాయట. ప్రస్తుతానికి బాలీవుడ్ సినిమాల బిజీతో కియారా ఇప్పట్లో తెలుగు సినిమాలు చేసే ఛాన్సే లేదంటున్నారు బీటౌన్ వర్గాలు. స్టార్ హీరోయిన్లుగా పేరు పడిన దీపికా, అనుష్క, ప్రియాంక వంటి వారందరూ పెళ్ళిళ్ళు చేసుకుని స్థిర పడడంతో కియారాకు మంచి డిమాండ్ వచ్చిందట. పనిలో పనిగా కియారా తన పారితోషికాన్ని డబుల్ చేసినా కిమ్మనకుండా ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారట బాలీవుడ్ దర్శక నిర్మాతలు. మరి ఇంత డిమాండ్ ఉన్న కియారా ఇప్పట్లో తెలుగులో నటించే ఛాన్సే లేదనీ, అసలు తెలుగుకు దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ జనాలు అనుకుంటున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:August 03, 2019, 12:49 IST