AFTER BHARATH SUCCESS SALMAN KHAN TO RELEASE INSHALLAH MOVIE ON NEXT EID TA
‘భారత్’ తో హిట్టు కొట్టిన సల్మాన్.. నెక్ట్స్ ఈద్‌కు మరో సినిమా రెడీ..
సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీ పోస్టర్
మన తెలుగు హీరోలకు సంక్రాంతి,దసరా పండగ సెంటిమెంట్ ఎలాగో.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఈద్ సెంటిమెంట్ ఉంది. ఈ పండగ రోజున విడుదలైన సల్లూభాయ్ సినిమాలు ఎక్కువమటుకు సక్సెస్ అందుకున్నాయి.తాజాగా ఈ ఈద్‌కు ‘భారత్’తో మరో సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఇపుడు రాబోయే ఈద్ పండగన ఏ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడో ప్రకటించాడు.
మన తెలుగు హీరోలకు సంక్రాంతి,దసరా పండగ సెంటిమెంట్ ఎలాగో.. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఈద్ సెంటిమెంట్ ఉంది. ఈ పండగ రోజున విడుదలైన సల్లూభాయ్ సినిమాలు ఎక్కువమటుకు సక్సెస్ అందుకున్నాయి. ఈ ఇయర్ కూడా ఈద్‌కు రిలీజైన ‘భారత్’ మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ బుధవారం రిలీజైన ‘భారత్’ మూవీ మొదటి రోజే రూ.42.30 కోట్లను రాబట్టింది. బుధవారం భారత్- సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా అన్ని మల్టీప్లెక్సులు, థియేటర్లు ప్రేక్షకులతో కలకలలాడాయి. గత రెండు ఈద్లకు రిలీజైన ‘రేస్ 3’, ‘ట్యూబ్ లైట్’ సినిమాలు మాత్రం సల్మాన్‌కు నిరాశనే మిగిల్చాయి. తాజాగా ‘భారత్’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న సల్లూభాయ్.. వచ్చే ఈద్‌కు కూడా తాను యాక్ట్ చేస్తోన్న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్...సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోన్న సినిమాను వచ్చే ఈద్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించాడు.
IT'S OFFICIAL... Salman Khan and Sanjay Leela Bhansali... #Inshallah release date finalized: #Eid 2020... SLB teams up with Salman after a long gap... #Inshallah stars Salman and Alia Bhatt. #Eid2020
గతంలో ఈద్ పండగ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’,‘దబాంగ్’,‘బాడీగార్డ్’,‘రెడీ’‘ఏక్ థా టైగర్’,‘కిక్’,‘భజరంగీ భాయిజాన్’ ‘సుల్తాన్’ వంటి సినిమాలు ఈద్ పండక్కే రిలీజై భారీ విజయాలను నమోదు చేసాయి.