బాహుబలి తర్వాత ప్రభాస్, రానా మరోసారి కలిసి నటించనున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఐతే ఈ సారి కూడా రానా.. ప్రభాస్‌కు ఎదురించే విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. బాహుబలిలో భళ్లాలదేవుడిగా భళా అనిపించిన రానా ఇపుడు మరోసారి ప్రభాస్‌ను ఢీ కొట్టే ప్రతినాయకుడిగా నటించబోతున్నాాడు. వివరాల్లోకి వెళితే.. బాహుబలి పుణ్యామా అని ప్రభాస్‌కు ప్యాన్ ఇండియా హీరో అయ్యాడు. ఈ సినిమాతో ప్రభాస్‌కు ఇండియా వైడ్‌గా మార్కెట్ ఏర్పడింది. బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకున్నఓవరాల్గా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. కేవలం బాలీవుడ్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల భారీ వసూళ్లను సాధించి హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు.
ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌కు సంబంధించిన వర్క్‌ను నాగ్ అశ్విన్ కంప్లీట్ చేసి స్క్రిప్ట్ కూడా లాక్ చేసాడట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కియారా అద్వానీ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్.. దేవ కన్యకు మానవుడికి పుట్టిన అద్భుత శక్తులున్న ఓ యువకుడి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్ర ఉందని చెబుతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా అరవింద్ స్వామిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ నాగ్ అశ్శిన్.. ఈ కథను రానాకు నేరేట్ చేయడంతో రానాకు ఈ కథ నచ్చి ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తానని నాగ్ అశ్విన్‌కు చెప్పాడట.
రానాకు కూడా ప్రభాస్ మాదిరి నేషనల్ వైడ్‌గా మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాలో విలన్‌గా అరవింద్ స్వామిని తీసుకోవాలనే నిర్ణయాన్ని నాగ్ అశ్విన్ పక్కన పెట్టేసి రానాను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సినిమాను ఈ యేడాది అక్టోబర్‌లో మొదలుపెట్టి.. 2022 ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నామని చెప్పుకొచ్చాడు.ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్టు సమాచారం.మొత్తానికి ఈ సినిమాలో రానాగా విలన్‌గా నటించడంపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aswani Dutt, Bollywood, Nag Ashwin, Prabhas, Prabhas 21, Rana daggubati, Tollywood, Vyjayanthi Movies