‘అర్జున్ రెడ్డి’ అక్కడ బ్లాక్‌బస్టర్.. మరి ‘RX100’ పరిస్థితేంటో..?

అదేంటి.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 రెండూ బ్లాక్‌బస్టర్ సినిమాలే కదా.. మళ్లీ ఇప్పుడు పరిస్థితేంటి అనుకుంటున్నారా..? ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా పలకరిస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 7, 2019, 9:32 AM IST
‘అర్జున్ రెడ్డి’ అక్కడ బ్లాక్‌బస్టర్.. మరి ‘RX100’ పరిస్థితేంటో..?
హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్100
  • Share this:
అదేంటి.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 రెండూ బ్లాక్‌బస్టర్ సినిమాలే కదా.. మళ్లీ ఇప్పుడు పరిస్థితేంటి అనుకుంటున్నారా..? ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా పలకరిస్తున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్‌గా రీమేక్ అయి సంచలన విజయం సాధించింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఈయన సినిమాలు ఇప్పుడు 80 కోట్లు కూడా వసూలు చేయలేని సమయంలో వచ్చిన కబీర్ సింగ్ ఏకంగా 280 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా 2019 హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
After Arjun Reddy movie RX100 going to be remade in Hindi and Sunil Shetty son Ahan Shetty will Introducing pk అదేంటి.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 రెండూ బ్లాక్‌బస్టర్ సినిమాలే కదా.. మళ్లీ ఇప్పుడు పరిస్థితేంటి అనుకుంటున్నారా..? ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా పలకరిస్తున్నాయి. arjun reddy,kabir singh arjun reddy,rx100 movie,rx100 movie remake,sunil shetty son ahan shetty,ahan shetty rx100,rx100 karthikeya,tara sutaria,tara sutaria twitter,payal rajput tara sutaria,tara sutaria hot photos,payal rajput hot song,payal rajput hot video songs,payal rajput rx100,telugu cinema,bollywood movie,ఆర్ఎక్స్100,ఆర్ఎక్స్100 రీమేక్ బాలీవుడ్,సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టితో ఆర్ఎక్స్100,అర్జున్ రెడ్డి కబీర్ సింగ్
సందీప్, కబీర్ సింగ్‌లో షాహీద్ కపూర్ Photo: twitter

షాహిద్ కెరీర్‌కు కబీర్ సింగ్‌తో ఊపు తీసుకొచ్చాడు సందీప్. ఇక ఇప్పుడు ఆర్ఎక్స్ 100 బాలీవుడ్‌లో రీమేక్ అవుతుంది. కార్తికేయ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను ఇప్పుడు అక్కడ సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి హీరోగా మొదలు పెట్టారు. ఈ మధ్యే షూటింగ్ కూడా మొదలైంది. మిలన్ లుథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అహన్ శెట్టి సరసన తారా సుతారియా నటిస్తుంది.
After Arjun Reddy movie RX100 going to be remade in Hindi and Sunil Shetty son Ahan Shetty will Introducing pk అదేంటి.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 రెండూ బ్లాక్‌బస్టర్ సినిమాలే కదా.. మళ్లీ ఇప్పుడు పరిస్థితేంటి అనుకుంటున్నారా..? ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఉత్తరాది ప్రేక్షకులను కూడా పలకరిస్తున్నాయి. arjun reddy,kabir singh arjun reddy,rx100 movie,rx100 movie remake,sunil shetty son ahan shetty,ahan shetty rx100,rx100 karthikeya,tara sutaria,tara sutaria twitter,payal rajput tara sutaria,tara sutaria hot photos,payal rajput hot song,payal rajput hot video songs,payal rajput rx100,telugu cinema,bollywood movie,ఆర్ఎక్స్100,ఆర్ఎక్స్100 రీమేక్ బాలీవుడ్,సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టితో ఆర్ఎక్స్100,అర్జున్ రెడ్డి కబీర్ సింగ్
ఆర్ఎక్స్100 హిందీ రీమేక్‌లో అహన్ శెట్టి, తారా సుతారియా

ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. దీనిపై కూడా భారీ అంచనాలున్నాయి. అసలే తెలుగు సినిమాలపై ఇప్పుడు హిందీలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆర్ఎక్స్ 100 కూడా వెళ్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి మరి తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఏం చేస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Praveen Kumar Vadla
First published: August 7, 2019, 9:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading