AFTER ALA VAIKUNTHAPURRAMLOO SUCCESS TRIVIKRAM NEXT MOVIE WITH JR NTR AND NEW MOVI TITLE AS AYINANU POYIRAAVALE HASTHINAKU TA
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు మరోసారి ‘అ’ సెంటిమెంట్.. ఈ సారి కూడా సరికొత్త టైటిల్‌తో..
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ (Jr NTR Trivikram)
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. మే నెలలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసాడు త్రివిక్రమ్.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని విడుదలైన ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈసినిమా త్రివిక్రమ్‌కు మరపురాని సంక్రాంతిని అందించింది. అయితే త్రివిక్రమ్ మరోసారి ఇదే ఫార్మూలాను రిపీట్ చేయనున్నాడని సమాచారం. అందులో భాగంగా వచ్చే సంక్రాతికి కూడా బరిలో కూడా త్రివిక్రమ్ దిగబోతున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను ఎన్టీఆర్ తో చేయడం దాదాపు ఖరారైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి `ఆర్ఆర్ఆర్` షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడు. ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె.. హస్తినకు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ రష్మిక మందన్న (Source: Twitter)
ఇక త్రివిక్రమ్ తన సినిమాలకు ఎక్కువగా ‘అ’ అనే టైటిల్ వచ్చేటట్టు టైటిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాడు. కెరీర్ మొదట్లో ‘అతడు’ అనే ‘అ’ అనే అక్షరంతో పెట్టాడు. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’ నుంచి వరుసగా తన సినిమాలకు ‘అ’ అనే అక్షరంతో మొదలలయ్యేటట్టు తన సినిమాలకు టైటిల్స్ పెడుతున్నాడు. అందులో ‘ అ..ఆ’, అజ్ఞాతవాసి, అరవింద సమేత. వీర రాఘవ’, ఇప్పుడు 'అల వైకుంఠపురములో' అంటూ వచ్చాడు. ప్రతీసారి అ అనే అక్షరంతో వస్తున్న సినిమాలు దాదాపు విజయం సాధిస్తుండటంతో ఇపుడు ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు అ అక్షరంతో మొదలయ్యే ‘అయినను పోయిరావలె... హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం.
ఎన్టీఆర్ సమేత త్రివిక్రమ్
మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు 'అరవింద సమేత' వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో ఈ తాజా సినిమాలో యాక్షన్ పాళ్లు తక్కువగా చూసుకొని.. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దాదాపు జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును గురించి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానున్నదని సమాచారం.