news18-telugu
Updated: September 15, 2020, 7:14 AM IST
గుండుతో చిరంజీవి (Instagram/Chiranjeevi)
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చిరంజీవి ఓ వైపు ఆచార్య సినిమా చేస్తూనే పలువురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు.

ఆచార్యలో చిరంజీవి (Twitter/Photo)
ఇప్పటికే చిరంజీవి... మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ఆ తర్వాత ఇద్దరు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు. అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి.. ఏ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళతాడా అనే సందిగ్ధం నెలకొని ఉండే. తాజాగా ఆ అనుమానాలకు తెరదించుతూ.. చిరంజీవి.. తన నెక్ట్స్ మూవీని తన కజిన్.. మెహర్ రమేష్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.

చిరంజీవి, మెహర్ రమేష్ (File/Photo)
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందివ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే మహతి ఇచ్చిన ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే చిరంజీవి కూడా తన నెక్ట్స్ మూవీకి మహతిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ క్యారెక్టర్‌ను ఎవరైనా స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ సినిమాకు సరిపోతుంది. అందుకే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రకు రౌడీ బేబి సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు.

చిరంజీవి,సాయి పల్లవి (File/Photo)
హీరోయిన్గా నయనతార పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో భాగంగా చిరంజీవి రీసెంట్గా గుండుతో మేకప్ టెస్ట్ చేయించుకున్నారు. ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 15, 2020, 7:12 AM IST