Katrina Kaif: చాలా గ్యాప్ త‌ర్వాత సౌత్ స్టార్‌తో జోడీ క‌ట్ట‌నున్న క‌త్రినా కైఫ్‌

After a long time Katrina Kaif pair up with sounth indian star

Katrina Kaif - Vijay Sethupathi: కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జోడీ కడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌.. ద‌క్షిణాదిలో ఇప్ప‌టి వ‌కు మూడు సినిమాల్లో మాత్ర‌మే కనిపించింది. అందులో రెండు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తే మ‌రో సినిమాలో గెస్ట్ పాత్ర‌లో మెప్పించింది. అది కూడా కెరీర్ ప్రారంభంలోనే. త‌ర్వాత ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌డం అక్క‌డే ఫుల్ బిజీగా మారిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇంత‌కీ మె చేసిన మూడు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలే కావ‌డం విశేషం. అందులో ఒక‌టి విక్ట‌రీ వెంక‌టేశ్‌తో చేసిన‌ మ‌ల్లీశ్వ‌రి. ఈ సినిమా సూప‌ర్‌హిట్ అయ్యింది. త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అల్ల‌రి పిడుగు సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఏమో డిజాస్ట‌ర్ అయ్యింది. త‌ర్వాత మ‌రో మ‌ల‌యాళ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది.

    ఇన్నేళ్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి మ‌రో సౌత్ స్టార్‌తో క‌త్రినా కైఫ్ న‌టించ‌బోతుందంటూ బాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ క‌త్రినా కైఫ్ జోడీ క‌ట్ట‌బోతున్న సౌత్ స్టార్ ఎవ‌రో తెలుసా.. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి. బాలీవుడ్‌లో అంధాదున్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ శ్రీరామ్ రాఘ‌వ‌న్ భారీ సినిమాను ప్లాన్ చేశాడు. అందులో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడు. ఈయ‌న జోడీగా క‌త్రినా కైఫ్‌ను న‌టింప చేయ‌డానికి ఒప్పించారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై క‌త్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

    ప్రస్తుతం విజ‌య్ సేతుప‌తి ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు హిందీలోనూ వ‌రుస సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో న‌టించ‌డానికి అంగీక‌రించారు. అందులో భాగంగానే శ్రీరామ్ రాఘ‌వ‌న్ సినిమాను ఓకే చేశార‌ని బాలీవుడ్ వ‌ర్గాల బోగ‌ట్టా.
    Published by:Anil
    First published: