హోమ్ /వార్తలు /సినిమా /

మూడేళ్ల తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేసిన మంచు మనోజ్..

మూడేళ్ల తర్వాత కొత్త సినిమా అనౌన్స్ చేసిన మంచు మనోజ్..

‘అహం బ్రహ్మాస్మి’సినిమాను అనౌన్స్ చేసిన మంచు మనోజ్ (Twitter/photo)

‘అహం బ్రహ్మాస్మి’సినిమాను అనౌన్స్ చేసిన మంచు మనోజ్ (Twitter/photo)

తాజాగా ఆయన నిర్మాతగా మారి తన పేరు మంచు మనోజ్ కలిసొచ్చేలా  ఎం ఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. ఈ బ్యానర్‌లో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో కొత్త సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

కొంతకాలంగా మంచు మనోజ్ కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే తన భార్యకు విడాకులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. రెండేళ్ల తమ అందమైన బంధానికి ముగింపు పలికామని.. తమ మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయని ఈ సందర్భంగా  అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. భార్యకు విడాకులు తర్వాత కాస్త రిలీఫ్ గా ఫీలైన మనోజ్ ఇకపై తన ఆనందాన్ని సినిమా రంగంలోనే వెతుక్కుంటానని అభిమానులకు తెలిపాడు. తాజాగా ఆయన నిర్మాతగా మారి తన పేరు మంచు మనోజ్ కలిసొచ్చేలా  ఎం ఎం ఆర్ట్స్ బ్యానర్ స్థాపించాడు. ఈ బ్యానర్‌లో ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌తో కొత్త సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసాడు. ఈ  చిత్రంతో శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

after 3 years manchu manoj announced new movie title aham brahmasmi in his own production,manchu manoj mm arts,manchu manoj aham brahmasmi,aham brahmasmi movie,Manchu manoj own production house,mm arts,manchu manoj starts produtcion house,Manchu Manoj,Manchu Manoj twitter,Manchu Manoj divorce,manchu manoj divorce confirm,Manchu Manoj movies,Manchu Manoj instagram,Manchu Manoj movies,Manchu Manoj,manchu manoj wife,manchu manoj wedding,manchu manoj interview,manchu manoj wife pranathi,manchu manoj divorce,manchu manoj divorce issue,manchu manoj marriage,manchu manoj family,actor manchu manoj,manchu manoj latest news,మంచు మనోజ్,మంచు మనోజ్ పెళ్లి,మంచు మనోజ్ విడాకులు,తెలుగు సినిమా,మంచు మనోజ్ భార్య ప్రణతి,మంచు మనోజ్ మరో కీలక నిర్ణయం,మంచు మనోజ్ సంచలన నిర్ణయం,మంచు మనోజ్ ప్రొడక్షన్ హౌస్,ఎంఎం ప్రొడక్షన్స్,అహం బ్రహ్మాస్మి,అహం బ్రహ్మాస్మి మంచు మనోజ్,
‘అహం బ్రహ్మాస్మి’సినిమాను అనౌన్స్ చేసిన మంచు మనోజ్ (Twitter/photo)

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మార్చి 6న ప్రారంభించబోతున్నట్టు పోస్టర్‌లో చూపించాడు. ఈ సినిమాకు మంచు మనోజ్‌తో పాటు వాళ్ల అమ్మగారైన మంచు నిర్మల కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. మంచు మనోజ్ 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత ఏ సినిమా చేయలేదు. అప్పట్లో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు కూడా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత కొత్త బ్యానర్‌లో కొత్త సినిమాను ప్రకటించాడు మనోజ్.  ఇందులో ఎవరెవరు నటిస్తారో తొందర్లోనే ప్రకటించే అవకాశం ఉంది. మంచు ఫ్యామిలీ విషయానికొస్తే.. ఆల్రెడీ మంచు ఫ్యామిలీకి  లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌తో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే ప్రొడక్షన్ హౌస్ ఉన్నాయి. వీటిలో మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు నిర్మాతలుగా లక్ పరీక్షించుకున్నారు. తాజాగా మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్ నిర్మాతగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. మరి సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు మనోజ్ ఒకవైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Manchu Family, Manchu Manoj, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు