• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AFTER 275 DAYS MALAYALAM MEGASTAR MAMMOOTTY STEPPED OUT OF HIS HOME HERE IS THE REASON SR

Mammootty : తొమ్మిది నెలలు గృహనిర్బంధంలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే...

Mammootty : తొమ్మిది నెలలు గృహనిర్బంధంలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే...

మమ్ముట్టి Photo : Twitter

Megastar Mammootty : హీరో మమ్ముట్టికి ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడ ఒకటి. ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు.

  • Share this:
    మలయాళ సినిమా అగ్రనటుల్లో ఒకడు మమ్ముట్టి. తెలుగుసినిమాలలోనూ నటించాడు మమ్ముట్టి. తెలుగులో ఆయన సూర్య ది గ్రేట్ లాయర్ ది గ్రేట్, దళపతి (తమిళ అనువాదం), స్వాతి కిరణం, ఇక లేటెస్ట్‌గా యాత్రలో నటించాడు. ఇక ఆయన విషయానికి వస్తే.. హీరో మమ్ముట్టికి ఉన్న గొప్ప లక్షణాల్లో పట్టుదల కూడ ఒకటి. ఏదైనా ఒకటి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. అనుకున్న పని చేస్తున్న సమయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గకుండా పని పూర్తి చేస్తారు. ఇదంతా ఎందుకంటే.. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉంటు కాలం గడుపుతున్నారు. అయితే ఇది అందరికి సాధ్యం కావపోవచ్చు. ఎందుకంటే.. అందిరికి అన్ని విధాలుగా అవసరాలు తీర్చేవారుండరు.. అంత ప్రివిలేజ్ ఉండదు. సామాన్యులకు.. పని చేసుకుంటూనే తిండి. అలాంటీ సమయంలో ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఏదో ఒక పని చేసుకోవాలి. ఇంకోందరు అన్ని ఉన్నా కారణం లేకుండా బయటకు వచ్చి తిరగడం చేస్తుంటారు. దీని వల్ల ఆ వైరస్ ఒకరినుండి మరోకరికిగా సోకుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మలయాళ నటుడు ఇంటినుంచి బయటకు వెళ్లకుండా దాదాపు 275 రోజులు తన ఇంట్లోనే ఉన్నాడు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంట్లోంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని భావించి.. ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు సూచించిన నేపథ్యంలో మమ్ముట్టి దాన్ని సవాల్ గా స్వీకరించాడు. ఎన్ని రోజులు ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ఉండగలనో చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన తొమ్మిది నెలలపాటు ఇంటికే పరిమితమైపోయాడు.

    Mammootty, Mammootty news, Mammootty challenge,Mammootty news,Mammootty house arrest,
    మమ్ముట్టి Photo : Twitter


    ఏ పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రాలేదట మమ్ముట్టి . ఇక 9 నెలలు పూర్తి అవ్వడంతో పోయిన శుక్రవారం బయటకొచ్చి స్నేహితులని కలిసి సరదాగా టీని తాగి తన ఛాలెంజ్‌ను పూర్తి చేశాడట. అయితే నిత్యం జనంలో ఉండే ఒక స్టార్ హీరో ఇలా ఏకధాటిగా తొమ్మిది నెలలు ఇంట్లోనే ఉండిపోవడమనేది ఖచ్చితంగా విశేషమే అని చెప్పాలి. అయితే ఈ తొమ్మిది నెలలు మమ్ముట్టి తన ఫిట్నెస్ మీద దృష్టిపెట్టాడట. తన ఛాలెంజ్ పూర్తవ్వడంతో తిరిగి షూటింగ్’లో పాల్గొంటున్నాడు మమ్ముట్టి. ఆయన ప్రస్తుతం ది ప్రీస్ట్, షైలాక్, వన్ అనే సినిమాలను చేస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు