12 ఏళ్ల తర్వాత విడుదల కానున్న ఎన్టీఆర్ ‘యమదొంగ’..

యమదొంగ (ఫేస్‌బుక్ ఫోటో)

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌కున్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన యమదొంగ సినిమాను 12 ఏళ్ల తర్వాత రిలీజ్ చేయనున్నారు.

  • Share this:
    టాలీవుడ్‌లో ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌కున్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘స్టూడెంట్ నెం 1’ సినిమా చేసారు. ఈ సినిమాతో వీళ్లిద్దరు తొలిసారి సక్సెస్ రుచి చూసారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘సింహాద్రి’ సినిమా తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘యమదొంగ’ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. సోషియో ఫాంటసీ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు..యమధర్మరాజుగా నటించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్  యంగ్ యమగా తనదైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ప్రియమణి, మమత మోహన్ దాస్ నటించారు. ఈ సినిమా విడుదలైన 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాను తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకు ‘విజయన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ తమిళ రచయత ఏఆర్‌కే రాజరాజ ీ సినిమాను మాటలు పాటలు రాసారు. సుదిక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: