Afghanistan comedian Nazar Mohammad: ప్రముఖ కమెడియన్ దారుణ హత్య.. ఇంట్లోంచి లాక్కెళ్ళి గొంతు కోసి దారుణం..

ఆఫ్ఘన్ కమెడియన్ నాజర్ మహమ్మద్ (Nazar Mahammod)

Afghanistan comedian Nazar Mohammad: ప్రముఖ కమెడియన్‌ను అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేసిన వైనం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు.. అఫ్గనిస్తాన్‌‌లో.

  • Share this:
ప్రముఖ కమెడియన్‌ను అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేసిన వైనం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు.. అఫ్గనిస్తాన్‌‌లో. ఆ దేశంలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నాజర్ మహమ్మద్‌ను అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేసారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాలిబన్లే సదరు కమెడియన్‌‌ను చంపేసారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో వాళ్లు వచ్చి బలవంతంగా బయటికి లాక్కెళ్లి మరీ చంపేసారని తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నాజర్ మొహమ్మద్ దారుణ హత్య సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం జులై 27 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ ఇంట్లోకి ప్రవేశించి.. గన్నులతో బెదిరించారు.

అక్కడితో ఆగకుండా అతడిని బలవంతంగా బయటికి లాక్కెళ్ళారు. వద్దని వేడుకుంటున్నా కూడా వినలేదు. చొక్కా పట్టుకుని మరీ ఈడ్చుకెళ్ళారు. ఆ తర్వాత నాజర్‌ని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు కాందహార్‌ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా పని చేసారు. అక్కడే ఆయనకు శత్రువులు ఉన్నారని తెలుస్తుంది.

కచ్చితంగా తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. కొన్ని రోజులుగా అఫ్గనిస్తాన్‌ పోలీసులపై తాలిబన్లు వరస దాడులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వాళ్ళు వెల్లడించారు. ఈ క్రమంలోనే నాజర్ మహమ్మద్ హత్య జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు.
Published by:Praveen Kumar Vadla
First published: