హోమ్ /వార్తలు /సినిమా /

ఘనంగా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ''N th HOUR" ప్రారంభం

ఘనంగా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ''N th HOUR" ప్రారంభం

Nth Hour Photo/ Twitter

Nth Hour Photo/ Twitter

లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న "N th HOUR" చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

లేడీ లయన్ క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ జంటగా ఆనంద్ కొలగాని దర్శకత్వంలో రాజు గుడిగుంట్ల నిర్మిస్తున్న "N th HOUR" చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శక,నిర్మాత యస్. వి. కృష్ణారెడ్డి, నిర్మాతలు ఏ. యం రత్నం, అచ్చిరెడ్డి, దామోదర్ ప్రసాద్ , బెక్కం వేణుగోపాల్ , ప్రసన్న కుమార్, డి యస్. రావు తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం విశ్వ కార్తికేయ, రిషికా కపూర్ హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా . నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు..ప్రముఖ దర్శకుడు యస్. వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ముఖ్య అతిధిగా వచ్చిన ఏ. యం రత్నం "N th HOUR " పోస్టర్ ను లాంచ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెకక్కుతున్న ఈ సినిమా టైటిల్ డిఫరెంట్ గా ఉంది. మంచి అడ్వెంచర్ కథతో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

చిత్ర నిర్మాత రాజు గుడిగుంట్ల మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉందో కథ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మాకు మంచి నటీ, నటులు, టెక్నిషియన్స్ లభించారు.నెక్స్ట్ మంత్ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మంచి అడవెంచర్ కథ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు ఆనంద్ కొలగానీ మాట్లాడుతూ.. కథలో జరిగే సంఘటనలు అనూహ్యంగా ఎప్పుడు ఎం జరుగుతుందో తెలియకుండా జరుగుతున్నందున ఈ సినిమాకు న "N th HOUR" అనే టైటిల్ పెట్టడం జరిగింది. విన్నూత్నమైన అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్ కథగా వస్తున్న ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన విశ్వ కార్తికేయకు జంటగా బాలీవుడ్ నటి రిషికా కపూర్ తెలుగు తెరకు పరిచమవుతుంది. ఈ అడ్వెంచర్ కథను మా నిర్మాతకు చెప్పిన వెంటనే తనకు నచ్చి ఈ తరహా కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఇంట్రెస్ట్ చూయించి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగుతుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ ఫ్లెడ్ ప్యాకేజ్డ్ గా ఉంటుంది. ఈ సినిమా ను నెక్స్ట్ మంత్ 6 నుండి మొదటి షెడ్యూల్ లో స్టార్ట్ అవుతుంది.

హీరో విశ్వ కార్తికేయ .. చాలా మంది లెజెండ్స్ వచ్చి మమ్మల్ని బ్లెస్స్ చేసినందుకు ధన్యవాదములు.. ఆనంద్ గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆడియన్స్ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇలాంటి అడ్వెంచరస్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

హీరోయిన్ రిషికా కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయ మవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి అడ్వంచర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

First published:

Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema

ఉత్తమ కథలు