"ఏడు చేప‌ల క‌థ" టీజ‌ర్.. వామ్మో ఏంది ఆ అరాచ‌కం..?

ఏడు చేపల కథ.. ఇప్పటి వరకు ఈ పేరుతో ఓ కథ ఉందని మాత్రమే తెలుసు అందరికీ. కానీ ఇప్పట్నుంచీ ఈ పేరు విన్న ప్రతీసారి బూతులే గుర్తొస్తాయి. నీతి కథలను కాస్తా బూతు కథలుగా మార్చేసారు ఓ దర్శకుడు. ఏడు చేపల కథ అంటూ పక్కా అడల్డ్ కామెడీ తీస్తున్నాడు. ఈ చిత్ర టీజర్ విడుదలైంది. బూతు సినిమాలు కూడా బిత్తరపోయేలా ఈ టీజర్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2018, 8:34 PM IST
ఏడు చేపల కథ
  • Share this:
తెలుగు సినిమా ఎటు వైపు వెళ్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. అడ‌ల్ట్ కామెడీలు ప‌క్క ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన‌పుడు చూసి బాపురే ఏంటిది.. వీళ్లకు అస‌లు క‌థ‌తో సంబంధం లేదా అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఇలాంటి క‌థ‌లు మ‌న ఇండ‌స్ట్రీలోనే వ‌స్తుంటే చూస్తూ ఊరుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోతున్నారు. "అర్జున్ రెడ్డి" లాంటి సినిమాల్లో అడ‌ల్ట్ తో పాటే క‌థ‌ను కూడా చెప్పారు. "ఆర్ఎక్స్ 100"లో క‌థ కాస్త త‌గ్గి.. ముద్దుల డోస్ ఇంకాస్త పెరిగింది. ఈ మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ముద్దుల‌తోనే కొన్ని సినిమాలు వ‌చ్చాయి.

"ర‌థం".. "నాట‌కం" ఇలా చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇక ఇప్పుడు వీట‌న్నింటికీ మించి మ‌రో సినిమా వ‌స్తుంది. దాని పేరు "ఏడు చేప‌ల క‌థ‌". ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైందిప్పుడు. స్యామ్ జే చైత‌న్య తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం తెలుగు సినిమా అడ‌ల్ట్ స్థాయిని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లింది. బూతు సినిమాలు కూడా బిత్త‌ర‌పోయేలా టీజ‌ర్ క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఇది చూసిన త‌ర్వాత అస‌లు థియేట‌ర్స్‌లో విడుద‌ల అవుతుందా అనేది కూడా అనుమాన‌మే. మ‌రి ఈ "ఏడు చేప‌ల క‌థ" అసలు ఎండుతుందో లేదో చూడాలిక.

First published: October 26, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com