హోమ్ /వార్తలు /సినిమా /

Hit 2: హిట్ 2 సినిమాపై .. అడివి శేష్ అప్ డేట్ ఇచ్చేశాడు.. వచ్చేది అప్పుడే..!

Hit 2: హిట్ 2 సినిమాపై .. అడివి శేష్ అప్ డేట్ ఇచ్చేశాడు.. వచ్చేది అప్పుడే..!

అడివి శేష్

అడివి శేష్

‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. హిట్2 సినిమాపై ఆయన ట్విట్టర్ వేదికగా తాజా అప్డేట్ ఇచ్చాడు

  హిట్: ది ఫస్ట్ కేస్ 2020, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ సారథ్యంలో సైలేష్ కొలను తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఎలాంటి హడావుడి లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది.అయితే అప్పట్లో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందని కూడా చెప్పారు. అయితే హిట్ 2లో విశ్వక్ సేన్ కాకుండా.. అడవి శేష్ నటించనున్నారు. అయితే ‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. హిట్2 సినిమాపై ఆయన ట్విట్టర్ వేదికగా తాజా అప్డేట్ ఇచ్చాడు.

  యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మూవీ ‘ మేజర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం అతడు ఆ బిజీలోనే ఉన్నాడు. ఈ సినిమా కోసం అడివి శేష్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉందని పలు ఇంటర్వ్యూల్లో అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ హీరో మేజర్ ఇంతటి గ్రాండ్ సక్సెస్ కావడానికి చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి.ఇక అడివి శేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్‌లో హిట్ మూవీ సీక్వెల్‌లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను జూలై 29న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ అడివి శేష్ మేజర్ సినిమా కోసం పడ్డ కష్టం వలన ఆయన చాలా అలిసిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.

  హిట్ 2 సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను ఈ నెలలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ తాను నిర్మాత నాని, డైరెక్టర్ శైలేష్ కొలనులను తనకు కాస్త సమయం కావాలని కోరనని చెప్పాడు. దీనికి వారు ఒప్పుకోవడంతో ఈ సినిమా రిలీజ్ మరికొంత లేట్ అవుతుందని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని.. కరెక్ట్ టైమ్‌లో హిట్2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఫైర్ క్రియేట్ చేసేందుకు వస్తామని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. అయితే హిట్ 2 సినిమా కోసం అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిట్ సినిమా ఫస్ట్ పార్ట్ ఎంతో సస్పెన్స్‌గా కొనసాగుతోంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Adavi sesh unhealty, Adivi Sesh, Hit 2

  ఉత్తమ కథలు