• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ADIVI SESH TEAM MAKING HUGE SETS FOR MAJOR FILM IN HYDERABAD HERE ARE THE DETAILS SR

Major : ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి.. రియలిస్టిక్‌గా కనిపించేందుకే అలా..

Major : ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి.. రియలిస్టిక్‌గా కనిపించేందుకే అలా..

మేజర్ టీజర్ పోస్టర్ Photo : Twitter

Adivi Sesh Major : అడివి శేష్‌.. క్షణం, గూఢచారి, ఎవరు.. వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు.

  • Share this:
    అడివి శేష్‌.. క్షణం, గూఢచారి, ఎవరు.. వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'మేజర్'. ఈ సినిమా ముంబైలో తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింమ్స్ వచ్చి మంచి ఆదరణ పొందాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ కూడా మంచి ఆదరణ పొందింది. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్లస్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి.. ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు హీరో అడివి శేష్‌. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషలలో మంచి స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతోంది.

    ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సన్నివేశాలను చాలా రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. అందుకోసం హైదరాబాద్‌‌లో ఆరు భారీ సెట్స్‌ను వేశారట. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, ఎన్ఎస్‌జీ కమాండో సెట్‌లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో భారీగా వేశారు. తాజ్ హోటల్‌ ప్యాలెస్ సెట్ హైలెట్’గా ఉంటుందట. దీనికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని కూడా సునిశితంగా పరిశీలి సెట్ వేశారట. ఈ సెట్‌ను 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్‌ వేశారట.

    మేజర్‌లో అడివి శేష్, శోభితాలతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్‌, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీశర్మ నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక అడివి శేష్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా 2019లో వచ్చిన ఎవరు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 2019 ఆగస్ట్ 15న విడుదలై అదిరిపోయే ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్నీ కట్టి పడేసింది. ఊహించని మలుపులు, ట్విస్టులతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు