పవన్ కళ్యాణ్ పిల్లలతో సరదాగా అడివి శేష్..

తెలుగులో ‘క్షణం’,‘గూఢచారి’, వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటినీ ఏర్పరుచుకున్న అడివి శేష్.. తాజాగా నటించిన ‘ఎవరు’ సినిమాతో మరో సక్సెస్‌ను ఆయన అకౌంట్‌లో వేసుకొని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

news18-telugu
Updated: August 26, 2019, 1:36 PM IST
పవన్ కళ్యాణ్ పిల్లలతో సరదాగా అడివి శేష్..
పవన్ కళ్యాణ్‌తో అడివి శేష్ (Twitter/Photo)
  • Share this:
తెలుగులో ‘క్షణం’,‘గూఢచారి’, వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఐడెంటినీ ఏర్పరుచుకున్న అడివి శేష్.. తాజాగా నటించిన ‘ఎవరు’ సినిమాతో మరో సక్సెస్‌ను ఆయన అకౌంట్‌లో వేసుకొని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అడివి శేష్ విషయానికొస్తే.. కేవలం హీరోగానే కాకుండా కథకుడిగా, దర్శకుడిగా, రాణిస్తున్నాడు.  ‘ఎవరు’ సినిమా సక్సెస్‌ను  ఎంజాయ్ చేస్తోన్న అడివి శేష్.. తాజాగా పవన్ కళ్యాణ్ పిల్లలతో గడిపిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇపుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, కూతురు ఆద్యాలతో సరదాగా గడిపిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. అంతేకాదు వాళ్లతో ఉన్న వీడియోను తన స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఇపుడు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  అంతేకాదు  పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక అడివి శేష్.. పవన్  కళ్యాణ్ పిల్లలను ఎక్కడ ఎపుడు కలిసిన విషయాలను మాత్రం వెల్లడించలేదు.
First published: August 26, 2019, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading