Adivi Sesh | Hit2 : అడివి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటించారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలవుతోంది. దీంతో ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకున్న హిట్ 2 అసలు ఎలా ఉంది.. కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏమాత్రం తెలుగు వారిని ఈ సినమా ఆకట్టుకోనుంది.. మొదలగు అంశాలను ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..
ఇక హిట్ 2 సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిందని చెప్పోచ్చు. అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో ట్రైలర్ కేక పెట్టిస్తోంది. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్.
Decently made thriller which sticks true to it's genre. This one focuses on realistic investigation procedure rather than heavy twists.. S A R K A R????#HIT2#HIT2onDec2 pic.twitter.com/TsWB7ncatR
— ʀᴇʙᴇʟ ɪɴ ᴅɪsɢᴜɪsᴇ (@MostViolentMan) December 2, 2022
Bro movie is excellent. If you r movie jus go n watch dnt ask anyone any info on #Hit2
— Sri (@sridentcrypto) December 2, 2022
#HIT2 liked it, pretty engaging throughout..bgm could have been better…looking fwd to #HIT3
— akhil_maheshfan2 (@Maheshfan_1) December 2, 2022
#HIT2 what a movie Man. Great writing and great work by entire team. Watched in Denver CO. Man spell bound and Speechless by #AdiviSesh performance. Hats off director #SaileshKolanu . Now i see the confidence behind producer #Nani #NaturalstarNani. So happy to see #HIT2 Universe
— Sri (@sridentcrypto) December 2, 2022
Average film The thrill factor and narration is weak compared to the first HIT film. Give it a try if you like suspense thrillers. Hit 3 looks promising ???? #HIT2
— Saddy (@king_sadashiva) December 2, 2022
#HIT2onDec2Show completed :- #Hit2 Blockbuster movie ???????? My rating 3.25/5
Positives :- @AdiviSesh acting ???????? Villain climax episode ???????????? Story ???????? Negatives :- Nothing Final word :- A true seat edge thriller ????????????#HIT2onDec2 pic.twitter.com/XwQG3WDe6m — THARUNI ❤ (@darlingfansgirl) December 2, 2022
ఈ ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే సినిమా బాగుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshii Chaudhary) హీరోయిన్గా చేస్తోంది. శేష్ ఈ సినిమాలో మొదటగా పెద్దగా పట్టింపు లేని ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది కథగా వస్తోంది. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉననాయని అంటున్నారు ప్రేక్షకులు.. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది. రావు రమేష్ కీలకపాత్రలో కనిపించారు.
ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన రొమాంటిక్ వీడియో సాంగ్ ఉరికే.. ఉరికే.. (Urike Urike song) పాటకు శ్రీలేఖ సంగీతం అందించారు. కృష్ణకాంత్ మంచి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్, రమ్య పాడారు.. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.
ఇక అడివి శేష్ సినిమా మేజర్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ , రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Hit 2, Tollywood news