• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ADIVI SESH MAJOR TEASER HINDI VERSION RELEASED BY SALMAN KHAN TELUGU BY MAHESH BABU MALAYALAM BY PRITHVIRAJ SUKUMARAN TA

Adivi Sesh Major: అడివి శేష్ ‘మేజర్’ టీజర్‌ కోసం రంగంలోకి మహేష్ బాబు, సల్మాన్ ఖాన్...

Adivi Sesh Major: అడివి శేష్ ‘మేజర్’ టీజర్‌ కోసం రంగంలోకి మహేష్ బాబు, సల్మాన్ ఖాన్...

‘మేజర్’ టీజర్‌‌ను విడుదల చేయనున్న సల్మాన్ ఖాన్, మహేష్ బాబు (File/Photos)

Adivi Sesh Major: తెలుగు సినీ ఇండస్ట్రీలో అడివి శేష్‌ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టీజర్‌ను మహేష్ బాబు, సల్మాన్ ఖాన్ తదితరులు వివిధ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

  • Share this:
    Adivi Sesh Major: తెలుగు సినీ ఇండస్ట్రీలో అడివి శేష్‌ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  అందరి కథానాయకుల్ల కాకుండా తనకు నచ్చిన  జానర్‌లో సినిమాలను తీస్తూ.. వాటిలో హీరోగా చేస్తూ వరుసగా విజయాలను సాధిస్తున్నాడు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కినవే. అందులో భాగంగా అడివి శేష్..  'క్షణం', 'గూఢచారి' ‘ఎవరు’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న తాజా చిత్రం మేజర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ మేజర్ సినిమా జులై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ రోజు సాయంత్రి 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను మహేష్ బాబు రిలీజ్ చేయనున్నాడు. మరోవైపు హిందీ వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ విడుదల చేయనున్నారు.

    ఇంకోవైపు మలయాళం వెర్షన్‌కు సంబంధించిన టీజర్‌ను పృథ్వీరాజ్ సుకుమరన్ విడుదలచేస్తున్నట్టు అడివి శేష్ తెలియజేసాడు. ఇక ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ `మేజర్` సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కిస్తున్నాడు. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ,మలయాళం, తమిళం, కన్నడలో  కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.








    View this post on Instagram






    A post shared by Sesh Adivi (@adivisesh)





    మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నాడు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నాడు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: