హోమ్ /వార్తలు /సినిమా /

Major : మేజర్ ఓటీటీ పార్టనర్‌ ఖరారు.. స్ట్రీమింగ్‌కు వచ్చేది అప్పుడేనట..

Major : మేజర్ ఓటీటీ పార్టనర్‌ ఖరారు.. స్ట్రీమింగ్‌కు వచ్చేది అప్పుడేనట..

Major  Photo : Twitter

Major Photo : Twitter

Adivi Sesh | Major OTT update | అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా లేటెస్ట్ సినిమా ‘మేజర్’.  ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా తెరకెక్కింది.

ఇంకా చదవండి ...

Adivi Sesh :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలైంది. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన మేజర్ జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు.

ఇక మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్ ఉండనున్నాయి.

ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.


‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

First published:

Tags: Adivi Sesh, Major Movie, Tollywood news

ఉత్తమ కథలు