Adivi Sesh : అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ట్రైలర్2తో పాటు పలు పాటలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ తాజాగా సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడుగుతూ.. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయచ్చోగా.. అని అడగ్గా.. దానికి హీరో అడివి శేష్ “పక్కా” అంటూ చెప్పుకొచ్చారు. అడివి శేష్ పంజాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మేజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన మేజర్ జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా హిందీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు (2 గంటల 28 నిమిషాలు) ఫిక్స్ చేశారు.
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ (Major Trailer) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ట్రైలర్ ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు.. మంచి ఏమోషన్స్‌తో కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ఓ ఇషా అంటూ సాగే ఈ పాట చాలా బాగుందని అంటున్నారు నెటిజన్స్. శేష్, సాయీ మంజ్రేకర్‌ల మధ్య కెమిస్ట్రీ బాగుందని.. విజువల్స్ ఎంతో నాచురల్‌గా ఉన్నాయని అంటున్నారు. శ్రీచరణ్ పాకల స్వరపరిచిన ఈ పాటను రాజీవ్ భరద్వాజ్ రాయగా.. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద పాడారు.
PAKKA #MajorOnJune3rd https://t.co/mDj96at2Og
— Adivi Sesh (@AdiviSesh) May 25, 2022
ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. కాగా ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Major film, Pawan kalyan, Tollywood news