రివ్యూ : మేజర్ (Major)
నటీనటులు : అడివి శేష్,సాయి మంజ్రేకర్,శోభితా ధూళిపాళ్ల,ప్రకాష్ రాజ్,రేవతి, మురళీ శర్మ తదితరులు..
ఎడిటర్: వినయ్ కుమార్ మరియు పవన్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంగీతం: శ్రీచరణ్ పాకాలా
నిర్మాతలు : GMB ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, మరియు A ప్లస్ S సినిమాలు కథ, స్క్రీన్ ప్లే : అడివి శేష్
దర్శకత్వం: శశి కిరణ్ తిక్క
26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన మూవీ మేజర్. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
26/11 ముంబైలో ముష్కరులు జరిపిన దాడిని దేశ ప్రజల మదిలో ఇప్పటికీ చెరిగిపోలేదు. ఈ ఉదంతంలో తాజ్ హోటల్‌లో ప్రవేశించిన ముష్కరులను మేజర్ సందీప్ కృష్ణన్ ఎలా మట్టు పెట్టి దేశ కోసం ప్రాణ త్యాగం చేసాడు. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఆర్మీలో జాయిన్ కావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు. ఈ సందర్బంగా ఆయన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ‘మేజర్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథనం..
2008లో ముంబైలో నవంబర్ 26న జరిగిన ముష్కరుల దాడుల నేపథ్యంలో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ‘26/11 ఎటాక్స్ వంటి సినిమా తెరకెక్కించాడు. అటు ఈ ఉదంతంపై మరో రెండు మూడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. వాటిన్నంటినీ చూసిన ప్రేక్షకులకు మేజర్ సినిమాలో మేజర్ ఉన్నికృష్ణన్ తాజ్ హోటల్‌లో చిక్కుకున్న హోస్టేజెస్‌ను ఎలా రక్షించాడనేనది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ సినిమా మొత్తాన్ని మేజర్ ఉన్నికృష్ణన్ తండ్రి ఫ్లాష్ బ్యాక్‌లో ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేసాడు. ఉన్నికృష్ణన్ చిన్నప్పటి నుంచి నేవీ ఆఫీసర్ కావాలని కలలు కంటాడు. కానీ కళ్ల జోడు కారణంగా అందులో సెలెక్ట్ కాలేకపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రేమతో ఆర్మీలో జాయిన్ అవుతాడు. అక్కడ సందీప్ ఉన్నికృష్ణన్ ట్రెనింగ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా తెరకెక్కించాడు దర్శకుడు. ట్రైనింగ్‌లో సైనికలు పడే కష్టాలను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. మధ్యలో హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ మాత్రం పంటి కింది రాయిలా ప్రేక్షకులను ఇబ్బంది పెడుతోంది. వారి కుటుంబ సమస్యలు ప్రేక్షకులను ఒకింత చికాకు పెడతాయి.
ఇక ముంబైలోని తాజ్ హోటల్‌ను ముష్కరులు ఎలా చెరపెట్టారు. వారి చెర నుంచి ఉన్నికృష్ణన్ ఎలా కాపాడాడు అనేది ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఇక వర్మ తెరకెక్కించిన 26/11 లో CST రెల్వే స్టేషన్ లో కసబ్ ఏ రకంగా కాల్పులు జరపాడనేది మాత్రం ఇందులో చూపించలేదు. వారు ఎలా మన దేశంలోకి ప్రవేశించడానికి చేసిన ప్రయత్నాలు చూపిస్తే ఇంకా బాగుండేది. ఈ మూవీలో పోలీసులు, ఇతర వీర సైనికుల ముష్కరులతో పోరాటం చేస్తూ ప్రాణాలు విడిచారు. వారి త్యాగాలను ఈ సినిమాలో పూర్తిగా విస్మరించారు.ఈ మూవీ పూర్తిగా సందీప్ ఉన్నికృష్ణన్ కోణంలోనే ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అడివి శేష్. దాన్ని అదే విధంగా పకడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు శశికిరణ్.ఈ మూవీ కెమెరామెన్ వంశీ పనితనం బాగుంది. కశ్మీర్ అందాలతో పాటు సినిమాలోని లోకేషన్స్‌ను అందంగా చూపించాడు. ఆర్ట్ డైరెక్టర్ తాజ్ హోటల్ సెటింగ్ లా అనిపించదు. ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది.
నటీనటుల విషయానికొస్తే..
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ బాగా నటించాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో మౌల్డ్ అయిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం NSG కమెండో తీసుకోవాల్సిన శిక్షణ తీసుకున్నాడు. దాని కోసం బాగానే శరీరాన్ని కష్టపెట్డాడు. ఆ ఫలితం తెరపై కనిపిస్తోంది. ఇక హీరోయిన్‌గా నటించిన సాయి మంజ్రేకర్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శోభితా ధూళిపాళ్ల ఉన్నంత పర్వాలేదనపించింది. మిగతా పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వారి పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
కథ
అడివి శేష్ నటన
ఆర్ట్ వర్క్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్
సెకండాఫ్ సాగతీత
ఇతర వీర సైనికులు, పోలీసుల త్యాగాలను చూపించక పోవడం..
చివరి మాట : ఓవరాల్‌గా దేశభక్తితో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామా
రేటింగ్ : 3/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Major Movie, Tollywood