Home /News /movies /

ADIVI SESH MAJOR MOVIE RELEASE ON 11TH FEB 2022 AND MAKERS RELEASE MAKING VIDEO TA

Major - Adivi Sesh : అడివి శేష్ ‘మేజర్’ మేకింగ్ వీడియో విడుదల.. రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన మేకర్స్..

అడివి శేష్ ‘మేజర్’ విడుదల తేది ప్రకటన (Twitter/Photo)

అడివి శేష్ ‘మేజర్’ విడుదల తేది ప్రకటన (Twitter/Photo)

Adivi Sesh - Major: అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే  వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్.. ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు.

ఇంకా చదవండి ...
    Adivi Sesh - Major: అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే  వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్.. ఈ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు. ఈ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 11న చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ (Acharya) రిలీజైన వన్ వీక్ గ్యాప్‌లో థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ’మేజర్`(Major) సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు.

    సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ,మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో  తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా విడుదల చేసిన మేజర్ మూవీ మేకింగ్ వీడియో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.



    ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ‘మేజర్’ మూవీని తెలుగు, హిందీతో పాటు మలయాళంలో మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

    Nagarjuna : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది..

    మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    Ravi Teja As Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా రవితేజ.. తొలిసారి బయోపిక్ మూవీలో మాస్ మహారాజ్..


    థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Bollywood news, Major film, Tollywood

    తదుపరి వార్తలు