Major : అడివి శేష్ మేజర్ మరో సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విడుదలకు 10 రోజుల ముందే.. భారత దేశంలో ఎంపిక చేసిన 9 ప్రధాన నగరాల్లో ఈ సినిమాను మే 24న (మంగళవారం) స్క్రీనింగ్ చేయనున్నారు.
Adivi Sesh - Major: అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో దేశ వ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోన్న ఆ సమయంలో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గడంతో ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య’సినిమాలు తమ సినిమాల కొత్త విడుదల తేదిలు ప్రకటించాయి. ఈ కోవలోనే అడివి శేష్ నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 27న విడుదల కానున్నట్టు ఆ తర్వాత ప్రకటించారు. చివరకు జూన్ 3న ఈ సినిమ ా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను 10 రోజుల ముందుగా 9 మేజర్ నగరాల్లో ప్రీ రిలీజ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఒక్కసారి కాకుండా.. ఒక్కో నగరంలో ఒక్కో రోజు స్పెషల్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్ కూడా చేశారు.
ఇలా ఒక సినిమాను విడుదలకు పది రోజుల ముందే విడుదల చేయడం అనేది ఈ సినిమానే మొదలు. ఢిల్లీతో పాటు రాజస్థాన్ జైపూర్, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కొచ్చి వంటి నగరాల్లో ఈ సినిమాను మే 24న ప్రదర్శించనున్నారు.
ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. కాగా ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.