Home /News /movies /

ADIVI SESH MAJOR MOVIE FIRST COLLECTIONS HERE ARE THE DETAILS SR

Major : మేజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత వసూలు చేసిందంటే.. ఇది ఊహించనిదే..

Major  Photo : Twitter

Major Photo : Twitter

Major Collections :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇంకా చదవండి ...
    Major Collections :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. మేజర్ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏకంగా 4 కోట్ల మార్క్ ని కూడా అందుకుంది. మేజర్ మొదటి రోజు 4.07 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి.. దాదాపుగా హాఫ్ మిలియన్ మార్క్ ని అందుకుందని అంటున్నారు. అయితే హిందీలో మాత్రం అంచనాలను అందుకోలేక పోయిందని అంటున్నారు. ఇక మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్‌కు ఖరారు చేశారు.

    మేజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
    Nizam: 1.75Cr
    Ceeded: 46L
    UA: 51L
    East: 34L
    West: 24L
    Guntur: 30L
    Krishna: 28L
    Nellore: 19L
    AP-TG Total:- 4.07CR (6.85Cr Gross)
    KA+ROI:- 0.35Cr
    Hindi – 0.35Cr
    OS: 2.35Cr
    వరల్డ్ వైడ్ మొత్తం:- 7.12CR(13.10CR Gross)

    ఇక ఈ సినిమా తెలుగు వర్షన్ బిజినెస్ 13 కోట్లు ఉండగా.. వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ 18 కోట్ల రేంజ్‌లో ఉంటుందని టాక్. దీంతో ఈసినిమా 19 కోట్ల రేంజ్‌‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో మొదటి రోజు వసూళ్లు కాకుండా.. ఇంకా 11.88 కోట్ల షేర్‌ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

    Adivi Sesh Major Movie
    అడివి శేష్ ‘మేజర్’ మూవీ(Twitter/Photo)


    ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Major Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు